Begin typing your search above and press return to search.

ఫస్ట్ సినిమాకే కోటి అందుకున్న బ్యూటీ?

By:  Tupaki Desk   |   27 May 2022 1:30 AM GMT
ఫస్ట్ సినిమాకే కోటి అందుకున్న బ్యూటీ?
X
సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ గా నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టమైన పని అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తగా నటీమణులు ఇండస్ట్రీలో అడుగు పెడుతూనే ఉంటారు. అందంతో డామినేట్ చేస్తూ మిగతా వారికి కూడా చాలా గట్టిగా పోటీని ఇవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అందం విషయంలో అయితే ప్రేక్షకుల అభిరుచి కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అందుకే వారిని ప్రతి సినిమాలో కూడా అకట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని.

అయితే కొంతమందికి మొదట్లోనే ఊహించని విధంగా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటారు. అయితే రీసెంట్ గా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన గ్లామర్ బ్యూటీ మాత్రం మొదటి సినిమాకే ఒక కోటి రూపాయల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఆ బ్యూటీ మరెవరో కాదు. మోస్ట్ ఫెమాస్ మోడల్ మనుషి చిల్లర్.. మోడల్ గా ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఈ హర్యానా బ్యూటీ 2017 మిస్ ఇండియా పోటీల్లో కూడా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న మనుషి కి గత రెండేళ్ల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మాత్రం కమర్షియల్ సినిమాలు చేయకుండా విభిన్నమైన సినిమాలు చేయాలి అని అడుగులు వేసింది. ఇక మొత్తానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో అవకాశం దక్కింది. ఆ సంస్థలో అక్షయ్ కుమార్ నటించిన పృద్విరాజ్ సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

హిస్యరికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భయం లేని భారత కింగ్ పృథ్వి రాజ్ చౌహన్ జీవిత ఆధారంగా తెరకెక్కింది. అయితే అతని భార్య గా సన్యోగిత అనే పాత్రలో మనుషి చిల్లర్ నటించింది. యశ్రాజ్ ఫిలిమ్స్ ఎంతోమంది నటీనటులు వెండితెరకు పరిచయం చేశారు.

అయితే ఎవరికి కూడా మొదటి సినిమాకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చింది లేదు. కానీ మనుషి చిల్లర్ సినిమాల్లోకి రాకముందే మోడల్ గా మంచి గుర్తింపు పొందింది. కాబట్టి ఆమెకు ఫస్ట్ సినిమాకు ఆ స్థాయిలో పారితోషకం ఇచ్చినట్లు సమాచారం.