Begin typing your search above and press return to search.

మామపైనే ముద్దుగుమ్మల ఆశలు

By:  Tupaki Desk   |   5 Dec 2019 6:33 AM GMT
మామపైనే ముద్దుగుమ్మల ఆశలు
X
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన 'వెంకీమామ' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 13న విడుదల కాబోతున్న ఈ చిత్రంకు పాజిటివ్‌ బజ్‌ ఉంది. వెంకీ మరియు నాగచైతన్యలు ఇద్దరు కూడా సక్సెస్‌ ట్రాక్‌ లో ఉన్న కారణంగా వెంకీమామ ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. నిజ జీవితంలో మామ అల్లుడు అయిన వెంకీ నాగచైతన్యలు సినిమాలో కూడా అదే పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రంపై హీరోయిన్స్‌ ఇద్దరు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరికి కూడా ఈ సినిమా చాలా కీలకం.

నాగచైతన్యకు జోడీగా నట ఇంచిన రాశిఖన్నా మెల్ల మెల్లగా స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్‌ లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కెరీర్‌ ఆరంభం నుండి సక్సెస్‌ ఫ్లాప్స్‌ అంటూ అప్‌ అండ్‌ డౌన్స్‌ వస్తున్నాయి. దాంతో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా మాత్రం ఈమెకు ఛాన్స్‌ రావడం లేదు. వెంకీ మామతో పాటు ప్రస్తుతం చేస్తున్న మరో రెండు సినిమాలు 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' మరియు ప్రతి రోజు పండుగే సినిమాలు హిట్‌ అయితే చరణ్‌.. బన్నీ.. మహేష్‌ వంటి స్టార్స్‌ ఈమెకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందకే వెంకీమామ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని మరీ వెయిటింగ్‌ చేస్తోంది.

ఇక ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో కుర్రాళ్ల గుండెలను గుల్ల చేసిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్‌ పలు చిత్రాలు చేస్తున్నా కూడా ఏ ఒక్కటి కమర్షియల్‌ గా సక్సెస్‌ అవ్వడం లేదు. దాంతో ఈ అమ్మడికి వెంకీమామ చిత్రంపై చాలా ఆశలు ఉన్నాయి. సినిమాలో ఈమె పాత్ర చిన్నది అంటూ ప్రచారం జరుగుతున్నా కూడా సినిమా సక్సెస్‌ అయితే ఆ సక్సెస్‌ ను క్యాష్‌ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశ్యంలో ఈ అమ్మడు ఉన్నట్లుగా తెలుస్తోంది. పాయల్‌ రాజ్‌ పూత్‌ మరియు రాశిఖన్నాలకు ఇద్దరికి కూడా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది... వారి కెరీర్‌ కు ఈమామ అల్లుడు ఎంత మేరకు ఉపయోగపడేను అనే విషయాలు ఈనెల 13 తర్వాత వెళ్లడయ్యే అవకాశం ఉంది.