Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల దెబ్బ కు ప్రొడ్యూసర్లు కుదేలు

By:  Tupaki Desk   |   13 Nov 2019 7:00 AM GMT
స్టార్ హీరోల దెబ్బ కు ప్రొడ్యూసర్లు కుదేలు
X
ఈ మధ్య టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. టాప్ లీగ్ స్టార్ హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోలు కూడా ఇదే బాట పడుతున్నారు. ఇదంతా చూసి ఈ స్టార్ హీరోలు నిజంగానే నిర్మాతలు అయ్యారని చాలామంది నమ్ముతున్నారు. అయితే ఇదంతా పైకి కనిపించే కోణం మాత్రమే. నిజానికి ఇతర హీరోలతో సినిమాలు నిర్మించే స్టార్ హీరోల బ్యానర్లు ఒకటి ఆరా తప్ప మిగతావి అసలు ప్రొడక్షన్ హౌసు లే కావు.

నిర్మాత అంటే ఎవరు? మొదటి రోజు కథా చర్చల నుండి మొదలు పెడితే రిలీజ్ అయ్యాక సినిమా డిజాస్టర్ అయితే ఆ బయ్యర్ల హీటు వరకూ.. అన్నిటినీ పూర్తిగా భరించే వాడే. లాభాలు లేకుండా ఫ్లాప్ అయిన సినిమా ను హిట్ గా ప్రచారం చెయ్యాలని హీరోలు కోరినా దానికి సరే అనేవాడు. ఇక హిట్ అయిన సినిమాకు కూడా లాభాలు లేకుండా.. అత్తెసరు లాభాల తో సరి పెట్టుకునేవాడు. ఇవన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తినే నిర్మాత అంటారు. వీటిలో ఏ లక్షణాలు నిర్మాత అని చెప్పుకుకునే స్టార్ హీరోల కు ఉన్నాయి చెప్పండి?

ఒక స్టార్ హీరో కనుక డేట్స్ ఇస్తే చాలు.. అతను నిర్మాత అయినట్టే. ఆయన బ్యానర్ పేరు సినిమాకు జోడిస్తారు. ఆయన ఏ టెన్షన్లు తీసుకోడు. ఏ న్యూసెన్సు పెట్టుకోడు. ఆ జాక్ పాట్ ఆఫర్లు అన్నీ రియల్ నిర్మాతకే. ఇంతటితో ఆగితే ఎలా? సదరు స్టార్ హీరోలు సినిమా ప్రకటించిన సమయం నుండి రిలీజ్ అయ్యేంత వరకూ ఎలాంటి ఫ్యామిలీ ట్రిప్స్.. ఫారెన్ వెకేషన్స్ కు వెళ్ళినా ఆ ఖర్చు అంతా రియల్ నిర్మాత ఖాతాలోనే పడుతుందట. దీన్ని మనం HERO GST లాంటి అందమైన కొత్త పేర్ల తో పిలుచుకోవచ్చు.

ఒక్క టాలీవుడ్ స్టార్ హీరోలే కాదు.. కోలీవుడ్ లో కూడా ఇదే తంతు కొనసాగుతోందని అంటున్నారు. ఈ బాధలు భరించలేక చాలామంది సీనియర్ ప్రొడ్యూసర్స్ సినిమా నిర్మాణానికి దూరం జరుగుతున్నారట. అసలే మితిమీరిన బడ్జెట్ల కారణంగా హిట్ సినిమాలకు కూడా లాభాల మార్జిన్ తగ్గిపోయింది. స్టార్ హీరోతో సినిమా అంటే ప్రొడ్యూసర్లు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టార్ హీరోల నిర్మాత టాగ్ వల్ల.. ఇతర కండిషన్స్ వల్ల నిర్మాతలు మింగ లేక కక్క లేక అన్నటుగా బాధలు పడుతున్నారట.

అందరికీ ఉపాధి కలిపించే నిర్మాత సంతోషం గా ఉన్నప్పుడే పరిశ్రమ చల్లగా ఉంటుంది. వారిని ఇబ్బందులకు గురి చేస్తే లాంగ్ రన్ లో అది పరిశ్రమకే తీరని నష్టమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.