Begin typing your search above and press return to search.

నాన్ వెజీలకు నచ్చని మాట చెప్పిన సామ్

By:  Tupaki Desk   |   6 Jun 2021 10:30 AM GMT
నాన్ వెజీలకు నచ్చని మాట చెప్పిన సామ్
X
రోజులు మారాయి. అందుకు తగ్గట్లే సెలబ్రిటీలు.. స్టార్లు తమ తీరును పూర్తిగా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ అంటే ఆకాశంలో విహరించే రోజులెన్నో. ఇప్పుడు స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ.. మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తూ.. సామాన్యులు ఏ మాత్రం జీర్ణించుకోలేనట్లుగా ఉండే ప్రముఖులు ఈ మధ్యన ఎక్కువ అయ్యారు. తాము తినే ఆహారాన్ని తామే పండించుకునే వారెందరు? అందునా.. అనుక్షణం బిజీగా ఉండే స్టార్లకు సాధ్యమేనా? అంటే సాధ్యమేనని చెబుతోంది సమంత.

ఒకవైపు వెబ్ సీరిస్ లు.. మరోవైపు సినిమాలు.. సామాజిక సేవా కార్యక్రమాలు.. ఇలా ఎన్నింటినో నిర్వహించే సమంత తాను తినే ఆహారాన్ని తానే స్వయంగా పండించుకుంటున్న వైనం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నమ్మలేని ఈ నిజాన్ని తాజాగా ఆమె వెల్లడించారు. కరోనా.. ఫుడ్ విషయంలో తనకున్న అన్నిఅభిప్రాయాల్ని సమూలంగా మార్చేసిందని చెప్పారు.

తన ఆహారాన్ని తానే పండించుకుంటున్నట్లు చెప్పిన సమంత.. ఇందుకు హైడ్రోఫోనిక్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఈ టెక్నాలజీని వినియోగించటం వల్ల మామూలుగా వాడే నీటికి కేవలం ఐదు శాతం నీటినే వాడుకోవచ్చన్నారు. ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీకి చెందిన తాను నాన్ వెజ్ నుంచి వెగాన్ గా మారినట్లు చెప్పారు. ఈ మార్పును తాను పూర్తిగా అస్వాదిస్తున్నట్లు చెప్పారు.

అంతేకాదు.. నాన్ వెజ్ ప్రియులకు చేదుగా అనిపించే మరో మాట ఆమె నోటి నుంచి వచ్చింది. ‘వీలైనంతవరకు నాన్ వెజ్ ను తగ్గించుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే కొనండి. మీ ఆహారాన్ని మీరు పండించుకోవటానికి ప్రయత్నించండి’ అని ఆమె చెప్పుకొచ్చారు. ముక్క మాట విన్నంతనే నోట్లో నీళ్లు ఊరే ఎంతో మందికి సామ్ మాటలు చేదుగా అనిపించటం ఖాయం.