Begin typing your search above and press return to search.
'ఆచార్య' కోసం బీ టౌన్ ఆరాటం..మెగా హీరోలు ఏమంటారో?
By: Tupaki Desk | 19 April 2022 5:18 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సిద్ధా అనే ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఈయన పాత్ర దాదాపు అర్థ గంటకు పైగానే ఉంటుంది.
అలాగే ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. చరణ్ కి జోడీగా పూజా హెగ్డే చేసింది. సోనూ సూద్ విలన్ రోల్ ను పోషించారు. గత ఏడాది మే నెలలోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ పడుతూ చివరాఖరకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.
దేవాదాయ శాఖలోని అక్రమాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చిరంజీవి, చరణ్ లు అవినీతిపై శంఖం పూరించే నక్సలైట్స్ గా కనిపించనున్నారు.
ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా.. మరింత బజ్ క్రియేట్ చేసేందుకు చిత్ర టీమ్ వరుస అప్డేట్స్ ను వదులుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి నిన్న 'భలే భలే బంజారా' అంటూ సాగే హుషారైన సాంగ్ ను రిలీజ్ చేశారు. మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్న ఈ సాంగ్ లో చిరు, చరణ్ లు పవర్ ఫుల్ ఎనర్జీతో చిరుత పులుల మాదిరి స్టెప్పులు వేసి అదరగొట్టేశారు.
ఈ సాంగ్ సౌత్ వాళ్లనే కాదు.. బీ టౌన్ ప్రేక్షకులనూ విశేషంగా ఆకర్షించింది. దీంతో లిరిక్స్ అర్థం కాకపోయినా చిరంజీవి-చరణ్ డాన్సులతో మిస్మరైజ్ చేశారని, పాట సూపర్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, ఆచార్యను హిందీలో కూడా విడుదల చేయలంటూ సోషల్ మీడియా వేదికగా చిత్ర టీమ్ కు తెగ రిక్వస్ట్ లు పంపుతున్నారు. మరి ఆచార్య కోసం బీ టౌన్ ప్రేక్షకులు ఆరాటపడుతున్న తరుణంలో మన మెగా హీరోలు ఏమంటారు..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.