Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఇది ఒక్క బటన్ ఉండే జాకెట్టు!

By:  Tupaki Desk   |   25 Jan 2020 1:29 PM GMT
ఫోటో స్టోరీ: ఇది ఒక్క బటన్ ఉండే జాకెట్టు!
X
అత్తెసరు భామలు ఎక్కువగా ఉండే చోటులో హాటు భామ అనే పేరు తెచ్చుకోవడం చాలా సులువు. అదే అందరూ హాటు ఘాటు అయిన బాలీవుడ్ లో అలాంటి టాగ్ సాధించడం చాలా కష్టమైన పని. అయితే ఇలాంటి కష్టమైన పనిని వాణి కపూర్ ఎంతో స్పష్టంగా చేసి చూపించింది. 'శుద్ద్ దేశి రొమాన్స్' లోనే హీరో సుశాంత్ కు ఘాటు లిప్పులాకులు ఇచ్చింది. 'బెఫిక్రే' లో రణవీర్ సింగుకు ఇచ్చిన కిస్సులు కనుక లెక్కపెడితే 'కిస్సుల కేటగిరీ' కింద వాణికి ఒక ఘనమైన అవార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా తుస్సుమనడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈమధ్యే 'వార్' సినిమా విజయంతో వాణి ఒక్కసారిగా బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

ఇంత హాటు బ్యూటీ సోషల్ మీడియాలో హీటు పెంచకపోతే ఇన్స్టాగ్రామ్ పరువు మర్యాద ఏం కావాలి? అందుకే ఆధునిక సంప్రదాయాలు అనుసరిస్తూ ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ ఒక నలుపు రంగు లవ్ ఎమోజి మాత్రం పెట్టింది. అంటే 'ఐ లవ్ బ్లాక్' అని అర్థమేమో. ఫోటోలో బ్లూ జీన్స్ ధరించి.. పైనేమో బ్లాక్ కలర్ జాకెట్ ధరించింది. ఆ జాకెట్టును సాధారణంగా ధరిస్తే మనం ఫోటోస్టోరీ రాయాల్సిన.. చదవాల్సిన పనేలేదు.. ఆ జాకెట్ కు కరెక్ట్ గా మధ్యలో ఒక బటన్ మాత్రం పెట్టుకుంది. దీంతో డ్రెస్సుకు టన్నుల్లో హాట్ నెస్ తోడయింది. ఇస్టైలు ఇస్మైలు కూడా అదరహో. ఒక చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకుని మరో చేత్తో శిరోజాలు సవరించుకుంటూ కిరాక్ పోజిచ్చింది.

కళ్ళు ఉండి కూడా కబోధులుగా ప్రవర్తించేవారు కాకుండా ఈ ఫోటో చూసిన సాధారణ వ్యక్తులు ఎవరైనా వాణి మాయలో పడిపోవడం ఖాయం. ఈ ఫోటోకు అందుకే చాలా లైక్స్ వచ్చాయి. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు. "బాలీవుడ్ విష కన్య".. "లాజవాబ్".. "స్టన్నింగ్ బ్యూటీ" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక వాణి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం 'షంషేరా' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.