Begin typing your search above and press return to search.
ఆ హీరో సినిమాలో పోప్ అండ్ ఒబామా
By: Tupaki Desk | 4 Oct 2016 12:07 PM GMTసదరు హీరో ఎవరో కాదు హాలీవుడ్ హార్ట్ త్రోబ్ లియోనార్డో డికాప్రియో. అందుకే అతని సినిమాలో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా.. పోప్ ఫ్రాన్సిస్.. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత నేతలు పెద్దలు నటిస్తున్నారు. అయితే కేవలం లియోనార్డో సినిమా అయినంత మాత్రం వీరందరూ నటించేస్తారా? అలాగైతే ఎప్పుడో నటించి ఉండాలిగా? పదండి చూద్దాం.
ఆరుసార్లు ఆస్కార్లకు నామినేట్ అయిన లియోనార్డో ఈ ఏడాది 'ది రెవనెంట్' సినిమాకుగాను ఆస్కార్ అందుకున్న సందర్భంలో.. పర్యావరణంలో వస్తున్న శాశ్వతమైన మార్పులు గురించి ప్రస్తావించాడు. క్లయమెట్ చేంజ్ ఈజ్ రియల్ అంటూ స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఈ క్లయమెట్ చేంజ్ కు కారణమైన గ్రీన్ హౌస్ వాయువులను ఎక్కువగా విసర్జిస్తోంది అమెరికాయే. ఇదే పాయింట్ చెప్పడానికి మనోడు దర్శకుడు ఫిషర్ స్టీవెన్స్ మరియు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ తో కలసి ''బిఫోర్ ది ఫ్లడ్'' అంటూ ఒక డాక్యుసినిమాను ప్రోడ్యూస్ చేశాడు. క్లయమెట్ చేంజ్ గురించి ఒళ్లు గగుర్పొడిచే విషయాలను ఈ డాక్యమెంటరీలో చెప్పబోతున్నాడని ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ఒబామా.. వాటికన్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్.. అలాగే భారతీయ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ సునీత నారైన్.. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాంకీ మూన్.. ఇలా పెద్ద పెద్ద వారితో మీటింగులూ.. ఇంటర్యూలు.. నిజంగా పోలార్ ఐస్ కరిగిపోతున్న విజువల్స్.. అలాగే ఇండియా - ఇండోనేషియా - ఐస్ ల్యాండ్ తదితర దేశాల్లో వస్తున్న పర్యావరణపరమైన మార్పులన్నీ డిస్కస్ చేశాడు. అక్టోబర్ 21న ఈ డాక్యుమెంటరీ సినిమా ధియేటర్లలో విడుదలవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/