Begin typing your search above and press return to search.

'అవ‌తార్-2' రిలీజ్ ముందు మ‌రోసారి టాప్ గ‌న్: మేవ‌రిక్!

By:  Tupaki Desk   |   1 Dec 2022 5:30 AM GMT
అవ‌తార్-2 రిలీజ్  ముందు మ‌రోసారి టాప్ గ‌న్: మేవ‌రిక్!
X
జేమ్స్ కామెరూన్ విజువ‌ల వండ‌ర్ 'అవ‌తార్ : ది వే ఆఫ్ వాట‌ర్' డిసెంబ‌ర్ 16 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని సంవ‌త్స‌రాలుగా అవతార్ -2 రిలీజ్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కౌంట్ డౌన్ మొద‌ల‌వ్వ‌డంతో? అభిమానుల్లో ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. స‌రిగ్గా ఇదే ఉత్సాహాన్ని ఎన్ క్యాష్ చేసుకోవ‌డానికి మ‌రోసారి టాప్ గ‌న్: మావెరిక్ రీ-రిలీజ్ అవుతుంది.

టామ్ క్రూజ్ న‌టించిన సంచ‌ల‌న చిత్రాల్లో మావెరిక్ ఒక‌టి. వేస‌విలో రిలీజ్ అయిన సినిమా భారీ విజ‌యం సాధించింది. పారామౌంట్ సంస్థ‌లో భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈనేప‌థ్యంలోనే మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని అలరించ‌డానికి రెడీ అయింది.

ఈ నెల 2 నుంచి 15వ తేదీ వ‌ర‌కూ ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. గ‌తంలో ఏఏ సెంట‌ర్ల‌లో ఎక్కువ వ‌సూళ్లు సాధించిందో? ఆయా సెంట‌ర్ల‌లో రీ-రిలీజ్ సైతం ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం.

మెట్రోపాలిట‌న్ సిటీస్ లో మ‌రోసారి భారీ వ‌సూళ్లు సాధించ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ సైతం అంచ‌నా వేస్తుంది. డిసెంబ‌ర్16 నుంచి అవే థియేట‌ర్ల‌లో అవ‌తార్2 రిలీజ్ అవుతుంది. అంత‌వ‌ర‌కూ మేవ‌రిక్ కోస‌మే థియేట‌ర్లు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. పైగా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ లేక‌పోవ‌డంతో థియేట‌ర్లు అన్నిఖాళీగానే ఉన్నాయి.

తెలుగు రాష్ర్టాల్లో దాదాపు సంక్రాంతి వ‌ర‌కూ ఇదే స‌న్నివేశం క‌నిపిస్తుంది. చిరంజీవి..బాల‌య్య సినిమాలు వ‌చ్చే వ‌ర‌కూ థియేట‌ర్ల ప‌రంగా చిన్న సినిమాల‌కు ఇబ్బంది ఉండ‌దు. అవ‌న్నీ దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్ చిత్రాన్ని మ‌ళ్లీ రీ-రిలీజ్ చేయ‌గ‌ల్గుతున్నారు.

ఈ రీ-రిలీజ్ ల ట్రెండ్ ఇప్ప‌టికే టాలీవుడ్ లో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. పాత హిట్ చిత్రాల‌న్ని మ‌ళ్లీ ఒక్కొక్క‌టిగా ప్రేక్ష‌కుల ముంద‌కొస్తున్నాయి. బాలీవుడ్ సైతం ఈ ట్రెండ్ ని అనుస‌రిస్తుంది. తాజా స‌న్నివేశంలో మావెరిక్ మంచి వ‌సూళ్లు సాధిస్తే మ‌రిన్ని హాలీవుడ్ చిత్రాలు రీ-రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.