Begin typing your search above and press return to search.
రిలీజ్ కు ముందే 'రాధేశ్యామ్' మేకర్స్ కు అన్ని కోట్ల లాభమా..?
By: Tupaki Desk | 4 Feb 2022 3:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండక్కి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేసుకున్నారు. అయితే కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2022 మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రభాస్ స్నేహితులు వంశీ కృష్ణ - ప్రమోద్ ఉప్పలపాటి ''రాధేశ్యామ్'' మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారనే సంగతి తెలిసిందే. 'మిర్చి' 'సాహో' సినిమాల తర్వాత వీరు కలిసి చేస్తున్న సినిమా ఇది. గత మూడేళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ పాన్ ఇండియా పాండమిక్ నేపథ్యంలో ఆలస్యమవుతూ వచ్చింది. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ తో చాలా కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి.
'రాధే శ్యామ్' నిర్మాతలు ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా మంచి లాభాలను ఆర్జించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ మరియు వడ్డీలు కలిపి దాదాపు 250 కోట్ల వరకు అయిందనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా 400 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. అంటే ప్రభాస్ సినిమా విడుదలకు ముందే 150 కోట్ల రూపాయలను నిర్మాతలకు తెచ్చిపెట్టినట్లు.
సినిమా నిర్మాణంలో ప్రభాస్ హోమ్ బ్యానర్ గోపీ కృష్ణ మూవీస్ కూడా భాగం పంచుకుందనే సంగతి తెలిసిందే. దీంతో లాభాల్లో డార్లింగ్ కు కూడా డీసెంట్ షేర్ ఉంటుంది. ఇక ఈ సినిమాని హిందీలో టీ సిరీస్ భూషణ్ కుమార్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'రాధేశ్యామ్' మూవీ తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో అత్యధిక స్క్రీన్స్ లో విడుదల కానుంది.
'డార్లింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' వంటి సినిమాల తర్వాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకొని చేసిన లవ్ స్టోరీ కావడంతో అందరూ ''రాధేశ్యామ్'' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా దక్షిణాది వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చగా.. ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్.రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.