Begin typing your search above and press return to search.
వివాదంతో మొదలై.. బిగ్ హిట్ తో ఎండ్
By: Tupaki Desk | 31 Dec 2021 5:30 PM GMTమన టాలీవుడ్ హీరోల్లో నాని స్టైల్ ప్రత్యేకం. సూపర్ టాలెంటెడ్ యాక్టర్ ఆ విషయంలో ఎలాంటి విమర్శ తనమీద లేదు. మన పక్కింటి అబ్బాయి.. మన ఇంట్లో అబ్బాయి అని నానిని ఇప్పటికే ప్రేక్షకులు సొంతం చేసేసుకున్నారు. వారి హృదయాల్లో తనకి ప్రత్యేకమైన స్థానాన్నిచ్చారు. సినిమా సినిమాకి దాన్ని కాపాడుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రేమని పెంచుకుంటూ స్టార్ గా ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడు నాని.
నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నానికి ఈ ఏడాది నిజంగా చెప్పాలంటే మర్చిపోలేని ఇయర్. తను చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఇటీవల ఏపీ టికెట్ రేట్లపై కిరాణ కొట్టు కలెక్షన్ లని పోలుస్తూ నాని చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించాయి. థియేటర్ కలెక్షన్ ల కన్నా ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల కారణంగా పక్కనే వున్న కిరాణ కొట్టు కలెక్షన్ లు బాగుతున్నాయని, టికెట్ రేట్లని తగ్గించి ఏపీ ప్రభుత్వం ప్రేక్షకుడిని అవమానించిందని నాని ఏపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇది పెద్ద చర్చకు తెరలేపింది. టికెట్ రేట్లపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేలా చేసింది. ఇక ఈ ఏడాది కెరీర్ పరంగానే నాని పెద్ద రిస్క్‌లే చేశాడని చెప్పొచ్చు. వి` ఫ్లాప్ తరువాత నాని నుంచి వచ్చిన చిత్రం `టక్ జగదీష్`. ఈ మూవీ కూఆ ఓటీటీలోనే విడుదలైంది. అలా రిలీజ్ చేయడం వల్ల మేకర్స్ సేఫ్ అయ్యారు కానీ హీరో నాని ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. `టక్ జగదీష్` ని ఎలా ఓటీటీలో రిలీజ్ చేస్తారని ఎగ్జిబిటర్లు, బయ్యర్లు నానిపై యుద్దం చేసినంత పని చేశారు. ఒక దశలో నాని, నాని చిత్రాలని బ్యాన్ చేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగిన విషయం తెలిసిందే.
ఈ వివాదం నుంచి నాని తేరుకుని చేసిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ లుగా నటించారు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో చేసిన సినిమా ఇది. అంతే కాకుండా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ద్విపాత్రాభినయంలో చేసిన చిత్రమిది. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. సినమా మరోసారి నాని మంచి నటుడని నిరూపించింది.
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చన ఈ చిత్రం యునానిమస్‌గా మంచి టాక్ ని సొంతం చేసుకుని నటుడిగా నాని సత్తాని మరోసారి చాటింది. రెండు పాత్రల్లో నటించి అందరి మనసులు గెలుచుకున్నాడు. వసూళ్లళ పరంగా సినిమా సేఫ్ జోన్ లోకి క్రమ క్రమంగా చేరుకుంటోంది. ఈ సినిమా తరువాత నాని `అంటే.. సుందరానికి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ జనవరి 1న రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాదిని చాలా క్రూషియల్‌గా ప్రారంభించి `శ్యామ్ సింగ రాయ్` వంటి పాన్ ఇండియా స్థాయి హిట్ తో ఎండ్ కార్డ్ వేయడం విశేషం.