Begin typing your search above and press return to search.
17 కంపెనీలు 700 మందికి పైగా VFX నిపుణులు
By: Tupaki Desk | 1 Dec 2022 2:30 AM GMTప్రభాస్-రానా ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు భాగాలు కలుపుకుని సుమారు 2200 కోట్లు వసూలు చేసింది. `బాహుబలి- 2` రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు అంటే అది ఎలాంటి సంచలన విజయం సాధించిందో అంచనా వేయొచ్చు.
అయితే `బాహుబలి` సిరీస్ గురించి మనకు తెలియని టాప్ 10 సంగతుల్లోకి వెళితే.. పలు క్రేజీ విషయాలు తెలిసాయి. `బాహుబలి` రెండు భాగాల ఎపిక్ ఫాంటసీ యాక్షన్ చిత్రం. ఇందులో ప్రభాస్- రానాలతో పాటు అనుష్క శెట్టి- తమన్నా భాటియా- రమ్య కృష్ణన్- సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రెండు భాగాల్లో బాహుబలి: ది బిగినింగ్ 2015లో విడుదల కాగా..`బాహుబలి: ది కన్‌క్లూజన్` 2017లో విడుదలైంది. ఇవి రెండూ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. బాక్సాఫీస్ వద్ద మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. లార్జర్ దేన్ లైఫ్ కంటెంట్ .. ఫాంటసీ కథాంశం.. భారీ యుద్ధ సన్నివేశాలు... రంజైన శృంగారం.. ఉత్కంఠ కలిగించే భావోద్వేగాలు ఈ సినిమాల ప్రత్యేకత. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను థియేటర్లకు ఆకర్షించడంలో రాజమౌళి టెక్నిక్ గొప్పగా వర్కవుటైంది.
ఈ సిరీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆర్టిస్టులు దర్శకనిర్మాతలు సాంకేతిక నిపుణుల అంకితభావం నిబద్ధతకు ఏకైక నిదర్శనం. బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ తన జీవితంలో 5 సంవత్సరాలు అంకితం చేసాడు. షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు మరే ఇతర ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. ఈ సిరీస్ పైనే పూర్తిగా దృష్టి నిలిపేందుకే తన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు.
ఇండియాలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో `బాహుబలి 2` మొదటి స్థానంలో నిలిచింది. ఇది మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. దాని మొత్తం దేశీయ కలెక్షన్లు రూ.1429.83 కోట్లు. ఓవర్సీస్ మార్కెట్ లో అమీర్ ఖాన్ నటించిన `దంగల్` తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమా ఇదే.
`బాహుబలి 2` అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన వారియర్ సినిమా. మొదటి భాగాన్ని 180 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా `బాహుబలి 2` బడ్జెట్ 250 కోట్లు గా నిర్ధారణ అయ్యింది. కాగా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా 30 కోట్ల బడ్జెట్ తో భారీ వార్ సన్నివేశాలను రూపొందించారు. నిజానికి ప్రభాస్ కోసం సేకరించిన జిమ్ పరికరాల విలువ సుమారు 1.5 కోట్ల రూపాయలు.
రాజమౌళి ఈ మూవీ కోసం ప్రాణం పెట్టారు. అతడి కుటుంబమంతా ఈ సినిమా కోసం ఐదేళ్లు పని చేసింది. నిజానికి ఇది ఫ్యామిలీ ప్యాకేజీ లాంటిది. కథను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసారు. సంగీతం కజిన్ ఎంఎం కీరవాణి అందించగా.. జక్కన్న భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసారు. రాజమౌళి కుమారుడు రెండవ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశారు. మొదటి భాగంలో మనకు వినిపించే `కిలికి` భాషను మధన్ కార్కీ రూపొందించారు. ఈ భాషలో 40 వ్యాకరణ నియమాలు 750 పదాలు ఉన్నాయి.
మొదటి భాగంలో అందమైన జలపాతం సీక్వెన్స్ గుర్తుంది కదా? రాజమౌళి మొత్తం మూడు లొకేషన్లలో 109 రోజుల్లో ఇక్కడ టాకీని చిత్రీకరించారు. ఈ ఫ్రాంచైజీలో మనం చూసే విజువల్ ఎఫెక్ట్స్ కోసం 17 కంటే ఎక్కువ VFX కంపెనీలు పని చేసాయి. 700 మందికి పైగా VFX కళాకారులు ఈ చిత్రానికి పనిచేశారు. వారిలో కొందరు గతంలో హాలీవుడ్ చిత్రం `జురాసిక్ వరల్డ్`కి పనిచేశారు.
ఈ సిరీస్ ని తెలుగు- తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. తరువాత హిందీ - కన్నడం- మలయాళంలోకి డబ్ అయి రిలీజైంది. ధర్మ ప్రొడక్షన్స్ హిందీ వెర్షన్ ను విడుదల చేసింది. హిందీ నటుడు శరద్ కేల్కర్ మహేంద్ర బాహుబలికి అమరేంద్ర బాహుబలికి ఇద్దరికీ గాత్రదానం చేశారు. ఇప్పటివరకు అతిపెద్ద పోస్టర్ ను రూపొందించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఘనత బాహుబలికే దక్కింది. ఇలా టాప్ 10 అంశాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవేననడంలో సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.