Begin typing your search above and press return to search.
చివరికి కిలాడీ కుమార్ అది కూడా కాపీయేనా?
By: Tupaki Desk | 6 Aug 2021 4:25 PM GMTకాపీ క్యాట్ వివాదాలు క్రియేటివ్ వరల్డ్ లో కొత్తేమీ కాదు కానీ.. ప్రతిసారీ పోస్టర్ల విషయంలో ఫలానా సినిమాకి కాపీ అంటూ ప్రచారం సాగేది. కానీ ఈసారి కిలాడీ కుమార్ నటించిన బెల్ బాటమ్ తాజా పోస్టర్ కాపీ వివాదం మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అక్షయ్ కుమార్ - వాణి కపూర్ జంటగా నటిస్తున్న `బెల్ బాటమ్` తాజా పోస్టర్ నెటిజనుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. అయితే ఈ పోస్టర్ అయినా ఒరిజినలేనా? అని వెతికిన వారికి కాపీ క్యాట్ క్లూ దొరికేసింది. శ్రీలంక నుండి వచ్చిన ట్రావెల్ బ్లాగర్ వైరల్ పిక్చర్ నుండి ఈ పోస్టర్ కాపీ చేసారని సదరు ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ పేర్కొన్నారు.
బెల్ బాటమ్ మొదటి పాట మార్జావాన్ రిలీజ్ కి ముందు మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేయగా వివాదం మొదలైంది. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుండి రకరకాల కారణాలతో ముఖ్యాంశాలలో ఉన్నప్పటికీ కొత్త పోస్టర్ కాపీ క్యాట్ కారణాల వల్ల మరింతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డైట్ సబ్య పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో డిజిటల్ క్రియేటర్ తీసిన ఫోటోకి కాపీ ఈ పోస్టర్ అంటూ ప్రచారమవుతోంది. అక్షయ్ కుమార్ తాజా బెల్ బాటమ్ పోస్టర్ వాస్తవానికి శ్రీలంక నుండి వచ్చిన ఇన్ ఫ్లుయెన్సర్ వైరల్ పిక్చర్ నుండి కాపీ చేయబడిందని పేర్కొంటూ ఒక పోస్ట్ ను డైట్ సబ్య పంచుకున్నారు.
బెల్ బాటమ్ తాజా పోస్టర్ లో అక్షయ్ కుమార్ - వాణి కపూర్ ఇద్దరూ రన్నింగ్ ట్రైన్ డోర్ నుంచి వెలుపలికి వచ్చి ఒకరితో ఒకరు కాస్త ఘాటుగానే సరసమాడుకుంటున్నారు. అక్షయ్.. వాణీ జంట చిరునవ్వులను ఈ పోస్టర్ లో చూడవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కామిల్లె వైరల్ ఫోటోని బెల్ బాటమ్ తాజా పోస్టర్‌తో డైట్ సబ్యా ఒక కోల్లెజ్‌ను పంచుకున్నారు. `మత్ లబ్ టాకీ బనా దో సబ్ కచ్ (sic)` అని ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు.
కెమిల్లె డెమిట్టెనేర్ ఒక ట్రావెల్ బ్లాగర్ ..చఆమె తన భాగస్వామి జీన్ హాక్ తో కలిసి ప్రపంచమంతా పర్యటిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె తరచుగా అసూయ కలిగించే రొమాంటిక్ చిత్రాలను పంచుకుంటుంది.ఈ ఫోటోలకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ఇన్ స్టా 344 కే అనుచరులను కలిగి ఉంది. కెమిల్లె - జీన్ జంటపై శ్రీలంక పర్యటనలో క్లిక్ మన్న ఫోటో ఇది. సోషల్ మీడియాలో ఒక రేంజులో వైరల్ అయింది. గత సంవత్సరం ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ కెమిల్లె దీనికి ఆసక్తికర వ్యాఖ్యను ఇచ్చారు. “మా ఫేవరెట్ 2019 పిక్.. ఈ సమయంలో మేము శ్రీలంకలో ఈ సుందరమైన రైలులో ప్రయాణిస్తుంటే నిన్నటిలా అనిపిస్తోంది. మొత్తం దేశంలో కొన్ని అందమైన దృశ్యాలు ఉన్నాయి. ఈ చిత్రంపై చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మేము దానిని గౌరవిస్తాము. కానీ మాకు ఇది అత్యంత సరదా చిత్రాలలో ఒకటి! అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు`` అని వ్యాఖ్యానించారు.
డైట్ సబ్య పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్ అయింది. ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ వైరల్ ఫోటోను పోలి ఉన్న పోస్టర్ ని చూపిస్తారా? అంటూ బెల్ బాటమ్ దర్శకనిర్మాతలను నెటిజనులు విమర్శించారు. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సమీర్ బెల్వాల్కర్ కూడా పోస్ట్ పై వ్యాఖ్యానిస్తూ, ``నేను అలాంటి ఫోటోషూట్ లో ఉన్నాను. నేను కొన్ని చేసాను. మాకు చూపించినవి అన్నీ పాశ్చాత్య మూవీ పోస్టర్ ల రిఫరెన్స్ లే. కొన్ని సందర్భాల్లో అంగుళానికి సరిపోలడం సహజం`` అని వ్యాఖ్యానించారు.
బెల్ బాటమ్ చిత్రానికి రంజిత్ ఎం తివారీ దర్శకత్వం వహించారు ఆగష్టు 19 న 3డిలో థియేటర్లలో విడుదల కానుంది.