Begin typing your search above and press return to search.
స్టార్స్ అంతా కలిసి ఉండరు.. బెల్లంకొండ షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 11 Jan 2021 9:20 AMఅల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. రాక్షసుడు సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ యంగ్ హీరో సంక్రాంతి కానుకగా అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా ప్రమోసన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల టాలీవుడ్ స్టార్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీకి రాక ముందు తనకు ఒక అభిప్రాయం ఉందని అది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మారిందని పేర్కొన్నాడు.
తాను హీరోగా పరిచయం అవ్వక ముందు ఇండస్ట్రీలో ఉన్న వారు అంతా కూడా ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటారని భావించాను. కాని ఇక్కడకు వచ్చిన తర్వాత అంతా ఒక ఫ్యామిలీ కాదనిపించింది. కాని ఇప్పుడు అనీల్ రావిపూడి గారు మా సినిమా ఫంక్షన్ కు రావడం మా సినిమా కోసం ఆయన సహకారం అందించడం జరిగింది. దాంతో నేను అనుకున్నది తప్పు అని ఇండస్ట్రీ స్టార్స్ అంతా కూడా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఒక ఫ్యామిలీలా కలిసి పోతారు అనిపిస్తుందని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నాడు. ఇటీవల జరిగిన అల్లుడు అదుర్స్ సినిమా వేడుకలో వివి వినాయక్ తో పాటు అనీల్ రావిపూడి పాల్గొన్నారు. అల్లుడు అదుర్స్ సినిమాకు స్క్రిప్ట్ సపోర్ట్ ను అనీల్ అందించినట్లుగా బెల్లంకొండ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.