Begin typing your search above and press return to search.
ఛత్రపతి రీమేక్ కోసం బాగా కష్టపడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్
By: Tupaki Desk | 3 Aug 2021 9:30 AM GMTబెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను తో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే అగ్ర కథానాయికులతో జత కట్టారు. ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఆరు సంవత్సరాలలో సమంత, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్ లాంటి వారితో కలిసి పనిచేశారు.
ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ పై దృష్టి పెట్టారు. ప్రభాస్ కెరీర్ లో అతిపెద్ద హిట్స్ లో ఒకటైన ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ లో బెల్లంకొండ నటిస్తున్నారు. మాస్ చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన వి. వి. వినాయక్ ఈ రీమేక్ ని తెరకెక్కిస్తున్నారు.
చాలా రోజుల తరువాత సెట్స్ లో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని సాయి చెప్పాడు. కరోనా ద్వారా షూటింగ్స్ ఆపేయడంతో, పనికు దూరంగా ఉన్నానని, తిరిగి సెట్స్ లో అడుగు పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ రీమేక్ కోసం బాగా సన్నద్ధం అవుతున్నట్టు సరి అన్నారు.
ఛత్రపతి రీమేక్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సాయి, హిందీ ప్రేక్షకులకి దగ్గరయ్యేందుకు హిందీ నేర్చుకుంటున్నట్టు తెలిపారు. భాష నేర్చుకోవడం ఛాలెంజింగ్ గా, అలాగే సరదాగా కూడా ఉందని, యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకి, హిందీ ప్రేక్షకులకు నచ్చేలా, కొన్ని మార్పులు, చేర్పులు చేశాము. ఈ రీమేక్ ని భారీ ఎత్తున నిర్మిస్తున్నాం, అని అన్నారు.
తనకి సినిమాలు చూడటం ఇష్టమని, హిందీ చిత్రాలు కూడా చూస్తుంటానని సాయి అన్నారు. బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ ని తన అభిమాన హీరో గా అభివర్ణించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కహో నా ప్యార్ హే, ధూమ్ 2 తనకి నచ్చిన చిత్రాలని అయన చెప్పుకొచ్చారు.