Begin typing your search above and press return to search.
థియేటర్ ఆర్టిస్టులా ఓవరాక్ట్ చేయడట!
By: Tupaki Desk | 30 July 2019 5:30 PM GMTనటన అనేది ఠఫ్ టాస్క్. నటించాడు అని ఎవరైనా అంటే ఫ్లాపైనట్టే. పాత్రలో జీవించాడు.. నేచురల్ గా కనిపించాడు! అని పొగిడితేనే కాంప్లిమెంట్ దక్కినట్టు ఏ హీరోకి అయినా. లేదూ స్టేజీ ఆర్టిస్టులా ఓవరాక్ట్ చేశాడు అని పోల్చేసినా అది ఎబ్బెట్టుగానే ఉంటుంది. అయితే ఈసారి `రాక్షసుడు` చిత్రంలో తనలో ఓవరాక్షన్ కంటే సహజసిద్ధంగా ఒదిగిపోయిన నేచురల్ నటుడిని చూస్తారని ఛాలెంజ్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించిన శ్రీను యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా స్పందించాడు.
ఎవరిని మోసం చేసినా కెమెరాని మాత్రం మోసం చేయలేమని .. అక్కడ ఓవర్ ఎగ్జయిట్ అయినా కనిపెట్టేయొచ్చని తెలిపాడు.థియేటర్ పెర్ఫామర్ లా లౌడ్ గా ఓవర్ ఎగ్జయిటెడ్ గా చేసినా తెలిసిపోతుందని తన అనుభవాన్ని రివీల్ చేశాడు. ఇకపోతే అతడు నటించిన రాక్షసుడు చిత్రంలో నటించేందుకు చాలానే శ్రమించాల్సి వచ్చిందని అన్నాడు. ఇక కోస్టార్ అనుపమ గురించి చెబుతూ.. తను సెట్లో ఉంటే వైలెంట్ గా ఉంటుందని అన్నాడు. గోల గోలగా చాలా అల్లరి చేసేస్తుందని తెలిపాడు. అంతేకాదు అనుపమ దర్శకత్వంలో నటిస్తానని కానీ టార్చర్ మాత్రం భరించాలని శీనూ నవ్వేశాడు.
అన్నట్టు నటన విషయంలో ఒక్కో సినిమాకి పరిణతి చెందుతున్న ఈ యువనటుడు ఇందులో బేసిక్స్ గురించి బాగానే చెప్పాడు. నవతరం నటీనటులకు ఇదో టిప్ లా ఉపయోగపడుతుందనడంలో సందేహమే లేదు. ఇదివరకూ చేసిన యాక్షన్ చిత్రాల్లో సాయి శ్రీనివాస్ నటన కాస్తంత ఓవర్ అయ్యిందన్న విమర్శలు వచ్చాయి. బెటర్ మెంట్ అవసరం అని క్రిటిక్స్ విశ్లేషించారు. ఇక తేజ లాంటి డైరెక్టర్ సైతం `సీత`లో ఓవరాక్ట్ చేయించాడని విమర్శించారు. మరి `రాక్షసుడు` (ఆగస్టు 2 రిలీజ్)లో తాను చెప్పిన ప్రమాణాలు పాటించాడా లేదా? అన్నది చూడాలి.