Begin typing your search above and press return to search.
ఐదేళ్లకు తప్పును ఒప్పుకున్న శీనూ
By: Tupaki Desk | 1 Aug 2019 5:38 AM GMTమన హీరోలు చేసిన తప్పును అంగీకరించడం కొత్త పరిణామం. నిన్ననే `ఆర్.ఎక్స్ 100` హీరో కార్తికేయ తన తప్పులను దిద్దుకుంటానని ఒక సినిమా ఫెయిలైనంత మాత్రాన అన్నిట్లో ఫెయిలవ్వనని మీడియా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. తాజాగా `రాక్షసుడు` ప్రీరిలీజ్ ఈవెంట్లో మరో యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చేసిన తప్పుల్ని అంగీకరించారు. చిన్న చిన్న తప్పులే.. ఇకపై అవి కూడా చేయను! అని అన్నారు. అన్నట్టు అల్లుడు శీను రిలీజై ఐదేళ్లయ్యింది కదా.. ఇన్నాళ్ల తర్వాత సారీ చెబితే ఎలా? అంటూ మీడియాలో గుసగుస వినిపించింది.
``చిన్న చిన్న తప్పులు చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్యూర్ రాకుండా ప్రయత్నిస్తాను. మంచి సినిమాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి నుండి నా కెరీర్ మొదలైంది. రాక్షసుడు నా మొదటి సినిమా. రెండో సినిమా కోసం వెయిట్ చేయండి`` అంటూ బెల్లంబాబు చాలానే ఎమోషన్ అయ్యాడు. ఇన్నాళ్లు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులు.. స్నేహితులకు థ్యాంక్స్ చెప్పాడు.
``అల్లుడు శీను` ఐదేళ్ల క్రితం రిలీజైంది. అభిమానుల ప్రేమ అండతోనే ఈ పయనం సాధ్యమైంది. రాక్షసుడు నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన సినిమా. అద్భుతమైన థ్రిల్లర్. ఎగ్జయిట్ మెంట్ పెంచే కథతో తెరకెక్కింది. ఇలాంటివి అరుదుగా దొరికే స్క్రిప్ట్. ఇంత మంచి స్క్రిప్ట్ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. క్రిస్టోపర్ అనే నటుడే ఒక రాక్షసుడు. కంటెంటే ఈ సినిమాకు హీరో. అందుకనే `రాక్షసుడు` అనే టైటిల్ పెట్టాం`` అని శ్రీనూ అన్నారు. కె.ఎల్.యూనివర్శిటీ అధినేత కోనేరు సత్యనారాయణ బ్యానర్ లో మునుముందు మరిన్ని సినిమాలు చేస్తానని తెలిపారు. ఈ ఐదేళ్ల కెరీర్ లో వరుస ఫ్లాపుల నుంచి శ్రీనూ చాలానే నేర్చుకున్నాడని అతడిలో ఎమోషన్ చెబుతోంది.