Begin typing your search above and press return to search.

USA ను భ‌లే ప‌డ‌తావు శీనూ

By:  Tupaki Desk   |   18 May 2019 5:26 AM GMT
USA ను భ‌లే ప‌డ‌తావు శీనూ
X
అమెరికా మార్కెట్లో స‌త్తా చాట‌డం అంటే ఆషామాషీనా? మ‌్యాట‌ర్ లేకుండా స్టార్ డ‌మ్ ఉన్న‌వాళ్ల‌కే గ‌త్యంత‌రం లేదు. కంటెంట్ బావుండాలి.. అంత‌కుమించి కామెడీ.. ఎమోష‌న్ తో ఆక‌ట్టుకుంటేనే.. ఇక్క‌డ జ‌నం ఆద‌రిస్తారు. అగ్ర‌హీరో సినిమా.. చిన్న హీరో సినిమా అనే తేడా ఉండ‌నిది ఓవ‌ర్సీస్. ఇక్క‌డ కంటెంట్ క‌నెక్ట‌యితే చాలు సూప‌ర్ హిట్టుకు ఛాన్సుంటుంది. ఆ కోణంలో ఆలోచించి మ‌నవాళ్లు అక్క‌డ కూడా మార్కెట్ ని ఛేజిక్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌ను క‌న‌బ‌రుస్తున్నారు. ఇటీవ‌ల ఈ ధోర‌ణి మ‌రీ ఎక్కువైంది. మీడియం రేంజ్.. అప్ కం హీరోలు దూసుకొస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా బెల్లంకొండ సురేష్ వార‌సుడు బెల్లంకొండ శ్రీను కూడా చేస్తోంది ఇదే. ఎట్టి ప‌రిస్థితిలో ఓవ‌ర్సీస్ మార్కెట్ ని ఏమాత్రం వ‌ద‌ల‌కూడ‌ద‌న్న పంతంతో ఉన్నాడు. అందుకే ఇటీవ‌ల త‌న సినిమాల‌న్నిటినీ అమెరికా స‌హా ఇత‌ర చోట్లా రిలీజ్ చేస్తున్నారు.

బెల్లంకొండ‌కు స్టార్ డ‌మ్ లేదు.. న‌ట‌వార‌స‌త్వం లేదు. హిట్లు అస‌లే లేవు. అయినా అత‌డి న‌మ్మ‌కం ఏంటో కానీ ప్ర‌తిసారీ అక్క‌డ త‌న సినిమాల్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. జ‌య జాన‌కి నాయ‌క మొద‌లు మొన్న వ‌చ్చిన క‌వ‌చం వ‌ర‌కూ అత‌డు ఓవ‌ర్సీస్ పై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయాయి. ఓవ‌ర్సీస్ లో నిర్ధ్వంద్వంగా తిర‌స్క‌రించారు. అయినా ఇప్ప‌టికీ ఆ మార్కెట్ ని వ‌దిలిపెట్ట‌కుండా భ‌ల్లూకం ప‌ట్టు ప‌డుతూ శీను మరోసారి చ‌ర్చ‌ల్లోకొచ్చాడు.

ఈనెల 24న బెల్లంకండ శ్రీ‌నివాస్ - కాజ‌ల్ జంట‌గా న‌టించిన సీత చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికాలోనూ భారీగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 23 రాత్రి నుంచే ఓవ‌ర్సీస్ లో ప్రీమియ‌ర్ల‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్క‌డ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని .. అగ్ర క‌థానాయ‌కుల సినిమాల్ని రిలీజ్ చేసిన గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థ బెల్లంకొండ‌ను ప్ర‌మోట్ చేస్తోంది. సీనియ‌ర్ పంపిణీదారుగా `సీత‌` చిత్రానికి హైప్ తెచ్చేందుకు స‌ద‌రు సంస్థ ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌. USA లో సెలెక్టెడ్ ఏరియాల్లో ప్రీమియ‌ర్ల‌కు ప్లాన్ చేసింది స‌ద‌రు సంస్థ‌. ఇటీవ‌లే మ‌హ‌ర్షి చిత్రాన్ని అమెరికాలో రిలీజ్ చేసిన ఈ సంస్థకు మంచి గుర్తింపే ఉండ‌డంతో అది `సీత‌`కు క‌లిసొచ్చే ఫ్యాక్ట‌ర్ అని చెబుతున్నారు. అక్క‌డ ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. `నేనే రాజు నేనే మంత్రి` లాంటి హిట్ చిత్రాన్ని అందించిన తేజ ఈ సినిమాని తెర‌కెక్కించ‌డం మార్కెటింగ్ కి కొంత‌మేర ప్ల‌స్ అవుతోంద‌ట‌. అయితే ఎవ‌రు ఎన్ని చెప్పినా అల్టిమేట్ గా సినిమాని గ్రిప్పింగ్ గా చూపించ‌క‌పోతే అంతే సంగ‌తి. సీత విష‌యంలో తేజ ఎలాంటి పొర‌పాటు చేయ‌కుండా గ్రిప్పింగ్ గా తెర‌పై మ‌లిచాడా? కాజల్ ఛ‌రిష్మాని ఎంత‌వ‌ర‌కూ స‌ద్వినియోగం చేశాడు? అన్న‌ది పూర్తి సినిమా చూసి తేల్చాల్సిందే. మే 24 రిలీజ్ సీత‌కు బెస్ట్ ఛాయిస్. అది ఏ మేర‌కు క‌లిసొస్తుందో చూడాలి.