Begin typing your search above and press return to search.
అప్పుడే టాకీ పార్ట్ కంప్లీట్ చేశారు
By: Tupaki Desk | 3 Jan 2022 11:30 AM GMTయంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ఏడాది బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. తెలుగు సెన్సేషనల్ హిట్ `ఛత్రపతి` రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ కు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత డా. జయంతిలాల్ గడ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మాస్ మసాలా యాక్షన్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఆ మధ్య వాయిదా పడిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.
షాకింగ్ విషయం ఏంటంటే అప్పుడే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసేశారు. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్ ఎంట్రీకి హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పీడు పెంచేసినట్టుగా స్పష్టమవుతోంది. టాకీ పార్ట్ పూర్తి కావడంతో మేకర్స్ పాటలని చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా వుంటే ఛత్రపతి పాత్ర కోసం హీరో సాయి శ్రీనివాస్ ఫిజికల్ గా ఊహించని స్థాయిలో తనని తాను పవర్ ఫుల్ లుక్ లోకి మార్చుకున్నారు. త్వరలోనే ఆ లుక్ ని ప్రేక్షకులకు రివీల్ చేయబోతున్నారు మేకర్స్. `ఛత్రపతి`కి స్టార్ రైటర్ కె.వి.విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన విషయం తెలిసిందే. హిందీ రీమేక్ కూడా ఆయనే కథ అందిస్తున్నారు.
యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వి.వి.వినాయక్ `ఛత్రపతి`రీమేక్‌ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లకు ఓ మాస్టర్ పీస్ లా తీర్చి దిద్దాలనే ప్రయత్నాల్లో వున్నారు. `ఖైదీ నెం.150` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వి.వి.వినాయక్ `అల్లుడు శ్రీను` సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే దర్శకుడు `ఛత్రపతి` రీమేక్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ ని బాలీవుడ్ తెరకు పరిచయం చేయబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అంతే కాకుండా `జయ జానకి నాయక` హిందీ వెర్షన్ `ఖూన్‌కార్` యూట్యూబ్ లో హ్యూజ్ హిట్ అయింది. ఈ మూవీకి 525 మిలియన్ ల వ్యూస్ లభించాయి. దీంతో ఈ మూవీ హిందీ వెర్షన్ రికార్డు సాధింయచింది. ఇదే `ఛత్రపతి` రీమేక్ కు బాగా కలిసి వచ్చే అవకాశం అని చెబుతున్నారు. హిందీలో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది కాబట్టి `ఛత్రపతి`లో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు భారీగానే శ్రమిస్తున్నారాయన. ఇందు కోసం పేరున్న సాంకేతిక నిపుణుల్ని ఆయన ఎంచుకున్నారు.
భలే భలే మగాడివోయ్, మహాను భావుడు వంటి చిత్రాలకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ నిజార్ అలీ షఫీ, సంగీత దర్శకుడు తనిష్క్ బాచి, ఫైట్ మాస్టర్స్ అనల్ - అరసు, మహర్షి, గజిని, స్పెషల్ 26 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. మమూర్ పూరి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీలోని కీలక పాత్రలలో సాహిల్ వాయిద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివమ్ పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మొహమ్మద్ మొనజిర్, ఆరోషిక దేయ్, వేదిక, జాసన్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ ఇండియా స్టాయిలో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` ని ఉత్తరాదిలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలియాభట్ నటిస్తున్న `గంగూబాయి`, అటాక్ చిత్రాలని కూడా ఆయనే పంపిణీ చేయబోతున్నారు. అలాంటి జయంతిలాల్ `ఛత్రపతి` రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ని బాలీవుడ్ కు పరిచయం చేస్తుండటం విశేషం.