Begin typing your search above and press return to search.
అతి పెద్ద స్మారక కట్టడంలో బెల్లంకొండ..!
By: Tupaki Desk | 30 Sep 2018 1:30 AM GMTబెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ చకచక జరుగుతుంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ ను థాయిలాండ్ లో చిత్రీకరించిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా బెల్లంకొండ థాయిలాండ్ షూటింగ్ కు సంబంధించి అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. తాజాగా మరో అప్ డేట్ ను ఈ చిత్రానికి సంబంధించి బెల్లంకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తాము ప్రస్తుతం కాంబోడియా ప్రాంతంలో ఉన్న అతి పెద్ద మతపరమైన స్మారక కట్టడం వద్ద చిత్రీకరణ చేస్తున్నాం. అక్కడ షూటింగ్ కు సంబంధించిన రెండు ఫొటోలను కూడా బెల్లంకొండ పోస్ట్ చేయడం జరిగింది. అంగ్కోర్ వాట్ టెంపుల్ వద్ద ఈ స్మారక కట్టడం ఉన్నట్లుగా ఆయన పోస్ట్ చేశాడు. ఈ స్మారక కట్టడం వద్ద చాలా రేర్ గా మాత్రమే షూటింగ్స్ కు అనుమతి ఇస్తూ ఉంటారట. ఒక అందమైన లొకేషన్ లో సినిమా చిత్రీకరణ జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ బెల్లంకొండ సన్నిహితులతో షేర్ చేసుకున్నాడు.
బెల్లంకొండ మొదటి సినిమా ‘అల్లుడు శీను’ నుండి కూడా భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే. వరుసగా సక్సెస్ లు అందుకున్న ఈయన తాజాగా ‘సాక్ష్యం’ చిత్రంతో నిరుత్సాహ పర్చాడు. ఆ చిత్రం తర్వాత చేస్తున్న ఈ చిత్రం బడ్జెట్ విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదనే అనిపిస్తుంది.