Begin typing your search above and press return to search.

బెల్లం హీరో రూటు మార్చాడే!

By:  Tupaki Desk   |   24 Oct 2018 5:58 AM GMT
బెల్లం హీరో రూటు మార్చాడే!
X
భారీ బడ్జెట్ డిమాండ్ చేసే కథ క్రేజీ అనిపించి మార్కెట్ లో పీక్స్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే తప్ప ఇప్పటిదాకా సినిమా చేయని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆలోచనా ధోరణిలో మార్పొస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి దాకా వివి వినాయక్- బోయపాటి శీను- భీమినేని శ్రీనివాస్ రావు- శ్రీవాస్ లాంటి పేరున్న మాస్ దర్శకులతో చేసినా గట్టి సక్సెస్ అందుకోలేకపోయిన సాయి శ్రీనివాస్ కొత్తగా ఎంచుకుంటున్న ప్రాజెక్టులు చూస్తుంటే రిస్క్ తీసుకోవడానికి రెడీ అయినట్టుగానే కనిపిస్తున్నాడు.

తేజ దర్శకత్వంలో ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా మీద భారీ క్రేజ్ లేదు కానీ విడుదల సమయానికి అంచనాలు రాక మానవు. నిజానికి తేజ భీభత్సమైన ఫామ్ లో లేడు. నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ అయినా మరీ రికార్డులు తిరగరాసేంత రేంజ్ కు వెళ్లలేకపోయింది. కాకపోతే హిట్టు లేక ఇమేజ్ బాగా డౌన్ అయిపోయిన తేజకు మంచి బూస్ట్ లాగా పనికి వచ్చింది. అలాంటి తేజకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తోటే సాయి శ్రీనివాస్ రిస్క్ కు రెడీ అయ్యాడు.

దీంతో పాటు మరో సినిమా కూడా లైన్ లో ఉంచిన ఈ బెల్లం హీరో తాజాగా దర్శకుడు రమేష్ వర్మకు ఎస్ చెప్పడమే అసలు షాక్. ఇతను ఇప్పటిదాకా హిట్ అనేది ఎరుగడు. చివరి సినిమా నాగ శౌర్య అమ్మాయితో అబ్బాయి. ఈ పేరు కూడా ఎవరికీ గుర్తు లేదు. మరి ట్రాక్ రికార్డు ఇంత పూర్ గా ఉన్న రమేష్ వర్మకు పిలిచి మరీ ఛాన్స్ ఇవ్వడం అంటే విశేషమే. పైగా ప్రేమ కథకు. ఇదిలా ఉంచితే రమేష్ వర్మ చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయట. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా రెండు సినిమాలు రమేష్ వర్మ చేయబోతున్నాడట. సాయి శ్రీనివాస్ తో కలిపి మొత్తం మూడు అవుతాయి.

సో ప్లాప్ ట్రాక్ మీదున్న హీరో దర్శకుడు కాంబో అంటే ఆసక్తి రేపేది కాదు కానీ హిట్ కొట్టే తీరాల్సిన అవసరం పీకల మీద ఉంటుంది కాబట్టి స్క్రిప్ట్ మొదలుకుని అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉంటారు. అన్నట్టు దర్శకుల విషయంలో రాజీ పడుతున్నా హీరోయిన్ల ఎంపికలో మాత్రం కుర్రాడు తగ్గట్లేదు. ఇప్పుడు సెట్స్ మీదున్న రెండు సినిమాలోనూ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కావడమే దీనికి నిదర్శనం