Begin typing your search above and press return to search.

ఫైనల్ గా ప్రేమలో పడనున్న బెల్లం హీరో

By:  Tupaki Desk   |   23 Oct 2018 12:32 PM GMT
ఫైనల్ గా ప్రేమలో పడనున్న బెల్లం హీరో
X
డెబ్యు మూవీ అల్లుడు శీను మొదలుకుని మొన్నటి సాక్ష్యం దాకా భారీ నుంచి అతి భారీ తప్ప చిన్న సినిమాలు ఎరుగని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇప్పటిదాకా తన రేంజ్ కు మార్కెట్ కు మించి హెవీ బడ్జెట్ కథలను ఎంచుకున్న సాయి శ్రీనివాస్ మొదటిసారి ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. రమేష్ వర్మ దర్శకత్వం వహించే ఈ మూవీని ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నట్టు సమాచారం. షూటింగ్ ప్రారంభం లాంటి వివరాలు రావడానికి ఇంకా టైం పడుతుంది.

శీను ప్రస్తుతం తేజ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో పాటు మరొకటి కూడా సెట్స్ మీద ఉంచాడు. ఈ రెండూ పూర్తయ్యాకే రమేష్ వర్మ సినిమా మొదలవుతుంది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నవి కూడా పూర్తిస్థాయి ప్రేమ కథలు కాకపోవడం వల్లే రమేష్ వర్మ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని టాక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ఏడాది చేదుగానే ముగుస్తోంది. ఎన్నో ఆశలతో నలభై కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన సాక్ష్యం డిజాస్టర్ గా మిగలడం ఇతన్ని కొంత ఆలోచనలో పడేసింది.

అందుకే తేజ రూపొందిస్తున్న మూవీలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు కూడా వార్త వచ్చింది కానీ యూనిట్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సాయి శ్రీనివాస్ సినిమాలు అన్నింటిలోనూ ప్రేమ ఉన్నప్పటికీ రకరకాల కమర్షియల్ అంశాలు డామినేట్ చేయడంతో అది పెద్దగా హై లైట్ అయ్యేది కాదు. అందుకే రమేష్ వర్మ చెప్పిన ఎమోషనల్ లవ్ స్టోరీ సున్నితమైన అంశాలతో పాటు తనలో నటుడికి ఛాలెంజ్ ఇచ్చేలా ఉండటంతో ఒప్పుకున్నట్టు టాక్. అన్ని కుదిరితే వచ్చే సంవత్సరం బెల్లం హీరోవి మూడు సినిమాలు వచ్చేలా ఉన్నాయి.