Begin typing your search above and press return to search.

కాజల్ పెళ్లి..యంగ్ స్టర్ కు అందిన ఆహ్వానం

By:  Tupaki Desk   |   20 Oct 2020 11:30 PM GMT
కాజల్ పెళ్లి..యంగ్ స్టర్ కు అందిన ఆహ్వానం
X
తెలుగు సినీ ప్రేక్షకులను తన గ్లామర్​తో మైమరిపించిన టాలీవుడ్​ చందమామ కాజల్​ అగర్వాల్​ ఈ నెల 30 న పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు, ముంబయికి చెందిన ప్రముఖ ఇంటీరియర్​ డిజైనర్​ గౌతమ్​ కిచ్చును ఆమె ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. వీళ్లిద్దరూ ఒకే స్కూల్​లో చదివారని.. చిన్నప్పటి నుంచే బెస్ట్​ ఫ్రెండ్స్​ అని.. ఆ తర్వాత ప్రేమించుకున్నారట. ఇటీవలే ఎంగేజ్​మెంట్ కూడా పూర్తయ్యింది. పెళ్లి మాత్రం చాలా సింపుల్​ గా జరుగబోతున్నదట. ఇరు కుటుంబాలకు చెందిన 30 నుంచి 40 మంది మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట.

ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. అయితే టాలీవుడ్​ యంగ్​ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆహ్వానం వచ్చినట్టు టాక్​. వీరిద్దరూ సీత, కవచం చిత్రాల్లో కలిసి నటించారు. అయితే కాజల్​కు తెలుగు సినీ పరిశ్రమలో బెల్లంకొండ శ్రీనివాస్​ బెస్ట్ ఫ్రెండ్​. కాజల్ ఎంగేజ్​మెంట్​కు కూడా అతడు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. బెల్లంకొండ, కాజల్​ ప్రేమించుకున్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని వాళ్లు కొట్టి పారేశారు. ఈ క్రమంలో బెల్లంకొండ, కాజల్‌ పెళ్లికి వెళ్తున్నట్లు ఫిలింనగర్​లో టాక్​ వినిపిస్తున్నది. ఇప్పటికే మెగాస్టార్​ ఆచార్యలో కాజల్​ నటిస్తున్నది. మరికొన్ని తమిళ సినిమాలకు కూడా ఆమె సైన్​ చేసింది. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని చెప్పింది.