Begin typing your search above and press return to search.
బెల్లంబాబుకు అంత రేటు ఇందుకే
By: Tupaki Desk | 1 May 2019 1:30 AM GMTబెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అరంగేట్రం చేసి ఐదేళ్లు అవుతోంది. కానీ ఇప్పటిదాకా కెరీర్లో నిఖార్సయిన హిట్టు ఒక్కటీ లేదు. వరుసగా భారీ మాస్ సినిమాలు చేయడం వల్ల.. పెద్ద పెద్ద దర్శకులు, హీరోయిన్లతో జత కట్టడం వల్ల అతడి సినిమాలకు ఓపెనింగ్స్ అయితే వస్తుంటాయి. మాస్ లో అతడికి కొంచెం ఫాలోయింగ్ కూడా వచ్చింది. తండ్రి బ్యాకప్ బలంగా ఉండటం వల్ల ఇప్పటికీ క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు. అతడి ప్రతి సినిమాకూ జరిగే బిజినెస్ లెక్కలు చూస్తే షాకవుతుంటారు. ఇప్పటిదాకా ఒక్క హిట్టు లేకున్నా.. అంత బడ్జెట్ ఎలా పెడతారు, అంత బిజినెస్ ఎలా జరుగుతుంది అన్నది అర్థం కాదు. ఇందులో కొంచెం ఫేక్ లెక్కలుంటాయన్నది కూడా వాస్తవమే. అలాగని పూర్తిగా ఫేక్ అని కొట్టి పారేయడానికి లేదు. భారీ బడ్జెట్లలో మాస్ సినిమాలు చేయడం ద్వారా ఉత్తరాదిన ఆ వర్గం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాడు శ్రీనివాస్.
బెల్లంబాబు సినిమాల్ని వరుసగా డబ్ చేసి హిందీలో రిలీజ్ చేస్తుంటే అక్కడ ఆదరణ అనూహ్యంగా ఉంటోంది. అతడి సినిమాలకు కోట్లల్లో వ్యూస్ వస్తుండటం విశేషం. తాజాగా శ్రీనివాస్ డిజాస్టర్ మూవీ ‘కవచం’ను హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఒక్క రోజులో 16 లక్షల వ్యూస్ వచ్చాయి. బాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాలకు దీటుగా వ్యూస్ ఉండటం విశేషం. దీని వ్యూస్ కోట్లలోకి వెళ్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రాన్ని సోనీ మ్యాక్స్ లాంటి ఛానెల్లో ప్రిమియర్ షోగా వేయడం కూడా గ్యారెంటీ. అక్కడా వ్యూస్ కు ఢోకా ఉండదు. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు ఇలాగే హిందీలో ఇరగాడేస్తున్నాయి. మన సినిమాలకు వస్తున్న వ్యూయర్ షిప్ చూసి పది కోట్లకు పైగా రేటు పెట్టి కొంటుండటం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కూడా ఆ రేటు పలుకుతోంది. అందుకే అతడి సినిమాలకు బిజినెస్ బాగా జరుగుతోంది.