Begin typing your search above and press return to search.

లేటెస్ట్ క్లిక్: 'అల్లుడు' శీను స్టైలిష్ లుక్ 'అదుర్స్' కదూ..!

By:  Tupaki Desk   |   9 Nov 2020 5:50 PM GMT
లేటెస్ట్ క్లిక్: అల్లుడు శీను స్టైలిష్ లుక్ అదుర్స్ కదూ..!
X
టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి లుక్ పరంగా పెద్దగా వేరియేషన్ చూపించడం లేదనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ స్టిల్స్ తో వారందరిని ముక్కున వేలేసుకునేలా చేసాడు శ్రీనివాస్. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉన్న ఈ మాస్ హీరో రీసెంట్ స్టైలిష్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో డిఫరెంట్ గెటప్స్ తో ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తున్న బెల్లంకొండ.. తన ఇంస్టాగ్రామ్ లో తాజా ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో శ్రీనివాస్ ట్రెండీ అవుట్ ఫిట్స్ తో బ్లాక్ గాగుల్స్ ధరించి ఉన్నాడు. పొడవాటి జుట్టు.. కోరమీసం.. గుబురు గడ్డంతో ఉన్న ఈ మాస్ హీరో ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న 'అల్లుడు' శీను స్టైలిష్ లుక్ కి లేడీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

బెల్లంకొండ సురేష్ తనయుడిగా 'అల్లుడు శీను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. వివి వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ ద్వారా పరిచయమైన ఫస్ట్ సినిమాతోనే మాస్ హీరోగా మెప్పించాడు. ఈ క్రమంలో 'స్పీడున్నోడు' 'జయ జానకి నాయక' 'సాక్ష్యం' 'కవచం' 'సీత' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇక గతేడాది 'రాక్షసుడు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్ లో ప్రస్తుతం 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల్లుడు అదుర్స్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ లో నభా నటేష్ - అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'అల్లుడు అదుర్స్' చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.