Begin typing your search above and press return to search.

లుక్ బాగానే ఉందమ్మా బెల్లంకొండ

By:  Tupaki Desk   |   14 May 2018 7:59 AM GMT
లుక్ బాగానే ఉందమ్మా బెల్లంకొండ
X
బెల్లంకొండ శ్రీనివాస్ భారీ హిట్ కోసం త‌ప‌న ప‌డుతున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత కొడుకైన‌ప్ప‌టికీ ఇంకా స్టార్ హీరోల చెంత చేరేంత హిట్‌ను అందుకోలేదు. మొద‌టి సినిమా అల్లుడు శీను ఫ‌ర్వాలేద‌నిపించింది. గ‌తేడాది విడుద‌లైన జ‌య‌జాన‌కి నాయ‌కా కూడా అత‌నికి పెద్ద ఫేమ్ తెచ్చి పెట్ట‌లేదు. ఇప్పుడు చేస్తున్న సాక్ష్యంపైనే ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఆ సినిమాలోని రేస‌ర్ లుక్ విడుద‌లైంది. ఆ ఫోటోలో శ్రీనివాస్ హాలీవుడ్ హీరోలా మెరిసిపోతున్నాడు.

ఎవెంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమాలో ఏ హీరోని చూసి స్పూర్తి పొందాడో కానీ... హాలీవుడ్ హీరో రేంజ్‌ లో ఫోజిచ్చాడు. సాక్ష్యం సినిమాలో స్పోర్ట్స్ కారు న‌డిపే సీన్ చేసి అదే గెట‌ప్‌ లో ఫోటోకు ఫోజిచ్చాడు. రేస‌ర్ సూట్‌ లో క‌ళ్ల‌కి గాగుల్స్ తో చేతిలో హెడ్ గేర్‌ తో న‌డుచుకుంటూ వ‌స్తున్న ఫోజ్ అమ్మాయిల‌ని ఫిదా చేసేలా ఉంది. ముందు రెండు సినిమాల‌తో పోలిస్తే ఈ గెట‌ప్ బెల్లంకొండ‌కు భ‌లే న‌ప్పేసింది. సాక్ష్యం సినిమాలో చాలా హ్యాండ్స‌మ్ గా కనిపించ‌బోతున్నాడ‌ట శ్రీనివాస్‌. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీవాస్ మాట్లాడుతూ హీరోను అల్ట్రా స్టైలిష్ గా చూపించ‌బోతున్న‌ట్టు చెప్పాడు. ఈ సినిమాలో హీరో హాలీవుడ్ రేంజ్‌ లో స్టంట్లు చేస్తాడ‌ని అందుకోస‌మే తాము పీట‌ర్ హెయిన్స్‌ ను స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ గా పెట్టుకున్నామ‌ని చెప్పాడు.

సాక్ష్యం సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్‌ పై తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం కోటిన్న‌ర దాకా చెల్లించి మ‌రీ పూజా హెగ్డేను హీరోయిన్‌ గా తీసుకున్నారు. ఎలాంటి భారీ హిట్ కొట్టాల‌న్న ఆలోచన‌తోనే ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. అమెరికాలోని ప‌లుచోట్ల ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. చివ‌రి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో తీయ‌నున్నారు. ఈ సినిమాను జూన్ 14న విడుద‌ల చేయ‌నున్నారు.