Begin typing your search above and press return to search.
మార్కెటింగ్ లో యువహీరో డైనమిజం
By: Tupaki Desk | 9 Feb 2019 6:59 AM GMTబెల్లం చుట్టూ చీమలు చేరడం సహజం. ఆ తీపి గుణం అలాంటిది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సన్నివేశం అలానే ఉందట. కుర్ర హీరో బెల్లం చాలా తీపి గురూ! అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్కెట్ లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉండే ఇలాంటి సెంటిమెంటు పరిశ్రమలో అంత తీపి బెల్లం.. అనకాపల్లి బెల్లం తయారీ ఎలా? అంటే ఈ యంగ్ హీరో లాజిక్ తెలిస్తే ఔరా! అంటూ ముక్కున వేలేసుకోకుండా ఉండలేరట. హిట్టు రాకపోయినా.. మార్కెటింగ్ స్ట్రాటజీలో ఈ యంగ్ హీరో రోల్ మోడల్ అంటూ పొగిడేస్తున్నారంతా.
శ్రీనివాస్ నటించే సినిమా హిట్టవుతుందా లేదా? అన్నది అటుంచితే, రిలీజ్ ముందు క్లీన్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చేయడంలో డాడ్ - బిగ్ డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాత బెల్లంకొండ సురేష్ స్ట్రాటజీ అదుర్స్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. `అల్లుడు శీను`గా తొలి ప్రయత్నమే హిట్ అందుకున్న శ్రీనూకి ఆ తర్వాత హిట్టు అన్నదే లేదు. అలాగే నటుడిగా కొత్తదనం కోసం ప్రయత్నించినా ఇంకా నాలుగైదు సినిమాల కిడ్ గానే అతడిని పరిశ్రమ చూస్తోంది. అతడి నుంచి కమల్ హాసన్ పెర్ఫామెన్స్ ని ఆశించడం సబబు కాదు కాబట్టి ఇంకా అప్ కం స్టార్ గానే చూస్తోంది ట్రేడ్.
అయితే రిలీజ్ విషయంలో భరోసాతో శ్రీనివాస్ సినిమాకి చక్కని మార్కెట్ ముందే దక్కుతోంది. థియేట్రికల్ రైట్స్ - డిజిటల్ రైట్స్ - డబ్బింగ్ రైట్స్ అంటూ శ్రీనివాస్ సినిమాకి మినిమంగా బడ్జెట్ మొత్తం రికవరీ అవుతుండడంతో నిర్మాతలు బాగానే వెంటపడుతున్నారు. అందుకే ఒక సినిమా వెంట ఒకటిగా అతడు సినిమాలు చేయగలుగుతున్నాడు. హిట్టు లేని పరిశ్రమలో ఇది ఎంతో కష్టం. అయినా అక్కడే లాజిక్ తో కొడుతున్నాడట బెల్లం బోయ్. నష్టాలొస్తే పారితోషికం విషయంలో ఎంతో ఫ్లెక్సిబిలిటీ చూపిస్తున్నాడు. పైగా మాస్ యాక్షన్ సినిమాలకు మినిమం కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ తరహా కథల్ని ఎంచుకోవడం కూడా అతడికి కలిసొస్తోందట. తన సరసన వేరొక స్టార్ హీరోయిన్ నటిస్తే ఆ మేరకు వసూళ్లు పెరుగుతున్నాయి. ఇలా రకరకాల లాజిక్కులు.. జిమ్మిక్కులతో సదరు యంగ్ హీరో దూసుకుపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇతర హీరోలతో పోలిస్తే మార్కెట్ నాలెడ్జ్ విషయంలో బెల్లంకొండ బెటర్ అని - అతడి వల్ల కొనుక్కునే బయ్యరుకు నష్టం లేకుండా చేసే ఎత్తుగడ వర్కవుటవుతోందని చెప్పుకుంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ - తేజ కాంబినేషన్ లో `సీత` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి లేడీ ఓరియెంటెడ్ కంటెంట్ తో తెలుగు ప్రేక్షకుల్ని తెలివిగా కొట్టేస్తున్నాడట.