Begin typing your search above and press return to search.

ఏ తండ్రీ అంత రిస్క్ చేయ‌డు!

By:  Tupaki Desk   |   1 Aug 2019 4:54 PM GMT
ఏ తండ్రీ అంత రిస్క్ చేయ‌డు!
X
మునుప‌టితో పోలిస్తే ఇప్పుడు శీనులో రియ‌లైజేష‌న్ క‌నిపిస్తోంది. మారిన శీను క‌నిపిస్తున్నాడు. `రాక్ష‌సుడు` రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూల్లో యువ‌ హీరో బెల్లంకొండ‌ శ్రీ‌నులో ప‌రిణ‌తి ఎంతో ఇదిగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం దీనిపై మీడియాతో పాటు అభిమానులు ఆస‌క్తిగానే మాట్లాడుకుంటున్నారు.

ఏ హీరో అయినా వ‌రుస ప‌రాజ‌యాలు ఎదురైతే త‌డ‌బ‌డ‌డం ఖాయం. ఎంత క‌ష్ట‌ప‌డినా హిట్టు రాలేద‌న్న టెన్ష‌న్ కొంతైనా ఉంటుంది. ఆ టెన్ష‌న్ బెల్లంకొండ శ్రీ‌నుకు క‌లిగింద‌నే అర్థ‌మ‌వుతోంది. అందుకే గ‌త త‌ప్పుల్ని నిజాయితీగా అంగీక‌రించాడు. ఇప్పుడు స‌రిదిద్దుకుంటున్నాడు. తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే విష‌యం ప్ర‌శ్నిస్తే.. స‌క్సెస్ కంటే ఫెయిల్యూర్స్ నుంచే ఎక్కువ నేర్చుకునే వీలుంది. అలా త‌న‌కు ప్ల‌స్ అని అన్నాడు. సాక్ష్యం.. క‌వ‌చం.. సీత ఇవ‌న్నీ తానొక‌టి అనుకుంటే ఫ‌లితం వేరొక‌లా వ‌చ్చింద‌ని అన్నాడు. అందుకే రాక్ష‌సుడు విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త తీసుకున్నాన‌ని రేయింబ‌వ‌ళ్లు ఎంతో శ్ర‌మించాన‌ని శ్రీను తెలిపాడు.

నేను చాలా క‌ష్టాన్ని ఎదుర్కొన్నాను... నా వ‌ల్ల‌ నాన్న గారికి త‌ప్ప‌లేదని అన్నాడు. ఇక నాన్న‌గారు బెల్లంకొండ సురేష్ మైండ్ సెట్ గురించి చెబుతూ..``నాన్న పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ నిర్మాత‌. ఎక్క‌డ హిట్టు కాంబినేష‌న్ ఉంటే అక్క‌డ‌కు వెళ‌తారు. అస‌లు ఫ్లాప్ ఉంది అంటే ఆయ‌న అటు వైపే చూడ‌రు. అంత క‌మ‌ర్షియ‌ల్ ప్రొడ్యూస‌ర్`` అనీ అన్నారు. సీత లాంటివి ఆయ‌న‌కు న‌చ్చ‌వు. అయినా నా కోసం రిస్క్ చేశారు. ఎవ‌రి కొడుకుల కోసం తండ్రులు అంత రిస్క్ చేయలేరు! అనీ అన్నాడు. ప్ర‌తి సినిమా మొద‌టి సినిమానే .. క‌ష్ట‌ప‌డాలి ఇక్క‌డ‌. అందుకే రాక్ష‌సుడు నా మొద‌టి సినిమా అని భావిస్తున్నాను అని శ్రీ‌ను ఎమోష‌న‌ల్ గానే తెలిపాడు. ఈ శుక్ర‌వారం `రాక్ష‌సుడు` రిజ‌ల్ట్ తేల‌నుంది.