Begin typing your search above and press return to search.
అమ్మ తమ్ముడు కంట తడి పెట్టారు
By: Tupaki Desk | 23 May 2019 4:39 AM GMT'అల్లుడు శీను' చిత్రంతో అరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ హీరోగా అయితే గుర్తింపు దక్కించుకున్నాడు కాని, కమర్షియల్ గా మాత్రం ఇంకా నిలదొక్కుకోలేక పోయాడు. అందుకోసం చాలా ప్రయత్నాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఈయన 'సీత' అనే ప్రయోగాత్మక చిత్రంను చేయడం జరిగింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సీత చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అంటూ సీత గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో హీరో బెల్లంకొండ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించిన ఆసక్తికర విషయాలు వెళ్లడించాడు.
'సీత' సినిమాలో తాను అమాయకపు పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాను. కథ నాకు ఎంతగా నచ్చిందంటే నాన్నను ఎదిరించి మరీ ఈ చిత్రాన్ని చేశాను. దర్శకుడు తేజ గారు నాకు రెండు కథలు చెప్పారు. ఆ రెండు కథల్లో నాకు సీత నచ్చితే, నాన్నకు మరోటి నచ్చింది. ఈ సినిమాలో హీరో పాత్రకు ప్రాముఖ్యత లేదని నాన్న అభిప్రాయం. అయితే నాకు ఇలాంటి సినిమాలు చేసే అవకాశం చాలా అరుదుగా వస్తాయి. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు ఈ సినిమా చేయాలని నిర్ణయించుకుని చేశాను.
ఈ చిత్ర కథ నా పాత్ర చుట్టు తిరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా రెండవ సారి నటించడంతో పాటు కాజల్ తో రెండవ సారి నటించాను. కాజల్ అద్బుతంగా నటించింది. సినిమా పూర్తి అయిన తర్వాత అమ్మ - తమ్ముడికి సినిమా చూపించాను. వారు సినిమాలోని నా నటన చూసి బాగా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా చివరి 30 నిమిషాల సీన్స్ కు వారు కంట తడి పెట్టుకున్నారు. తప్పకుండా ప్రేక్షకులు కూడా సినిమాకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అంటూ బెల్లంకొండ చెప్పుకొచ్చాడు.