Begin typing your search above and press return to search.

బెల్లం కొండ బాబు ఆచితూచి అడుగేస్తాడా?

By:  Tupaki Desk   |   22 Nov 2018 6:58 AM GMT
బెల్లం కొండ బాబు ఆచితూచి అడుగేస్తాడా?
X
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం 'కవచం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబర్ 7 న విడుదల చెస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఫిలిం మేకర్స్ రిలీజ్ విషయంలో పునరాలోచనలో పడ్డారట.

డిసెంబర్ 7 న తెలంగాణా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ డేట్ కావడంతో ఆ రోజు తెలంగాణా వ్యాప్తంగా ప్రజలందరూ ఆ హడావుడిలో ఉంటారు. ఏపీ లో ఎలెక్షన్స్ లేకపోయినా తెలంగాణా ఎన్నికల మీద అమితాసక్తి వ్యక్తం అవుతుంది కాబట్టి సినిమాలకంటే పోలింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ ఛానల్స్ చూస్తుంటారు. ఈ హంగామాలో 'కవచం' సినిమాకు కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇదొక్కటే కారణం కాదట. 7వ తేదీ రిలీజ్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ ను హడావుడిగా ముగించాల్సి వస్తుందట. దీంతో నిర్మాతలు ఒక వారం ఆలస్యంగా డిసెంబర్ 14 న విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ డేట్ మార్చినందువల్ల మరో ప్లస్ కూడా ఉంది. అదేంటంటే '2.0' నవంబర్ 29 న రిలీజ్ అవుతోంది. సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రమ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతుంది. ఇలాంటి పరిస్థితిలో '2.0' విడుదలయిన వారంలోపు 'కవచం' సినిమాను రిలీజ్ చేయడం డేంజరే. అందుకే త్వరలో కొత్త డేట్ ను ప్రకటిస్తారని సమాచారం.