Begin typing your search above and press return to search.

ఛాన్స్ వదులుకోకు శ్రీనివాసా!

By:  Tupaki Desk   |   6 Aug 2019 4:45 AM GMT
ఛాన్స్ వదులుకోకు శ్రీనివాసా!
X
ఎట్టకేలకు పట్టువదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం సినిమా అనే భేతాళాన్ని మోసుకుంటూ తిరిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఫైనల్ గా హిట్ అయితే వచ్చేసింది. కానీ ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడా అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. కారణం రాక్షసుడుకి ఎంత మంచి టాక్ వచ్చినా ఎవరూ నెగటివ్ గా రెస్పాండ్ కాకపోయినా కలెక్షన్లు మాత్రం యావరేజ్ గానే ఉండటం. మొదటి మూడు రోజులు ముఖ్యంగా ఏ సెంటర్స్ హౌస్ ఫుల్స్ తో నడిచిన రాక్షసుడు అనూహ్యంగా సోమవారం నుంచి చాలా డ్రాప్ చూపించడం ఆందోళన కలిగిస్తోంది.

ఒకపక్క విపరీతమైన వర్షాలు ఓ కారణంగా కనిపిస్తున్నప్పటికీ బాగున్న సినిమాకు అదేమీ పెద్ద అడ్డంకి కాదని గతంలో ఎన్నోసార్లు ఋజువయ్యింది. సో ఇప్పుడు రాక్షసుడు విషయంలో హీరోతో పాటు టీమ్ ఇంకా యాక్టివ్ గా మారి పాజిటివ్ టాక్ ని తమకు అనుకూలంగా మలుచుకోవడం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అపోజిషన్ గా వచ్చిన గుణ 369 డివైడ్ టాక్ రాక్షసుడికి చాలా హెల్ప్ అవ్వాలి. కానీ పూర్తి స్థాయిలో అలా జరగడం లేదు. సాయి శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు శీను నుంచి ఇప్పటిదాకా ప్రతి సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తూనే ఉన్నాడు.

డాన్సుల పరంగా ఫైట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఫిట్ నెస్ మైంటైన్ చేస్తున్నాడు. యాక్టింగ్ పరంగా ఐదారు సినిమాలకే ఎన్టీఆర్ ఏఎన్ ఆర్ లెవెల్ లో బ్రహ్మాండంగా నటించేయాలి అని కోరుకోవడం అత్యాశే కాబట్టి ఒకరకంగా అప్పటికి ఇప్పటికీ సాయి శ్రీనివాస్ లో చాలా మెరుగుదల కనిపిస్తోంది. ఇప్పుడు చేయాల్సిందల్లా సరైన దారిలో సినిమా పబ్లిక్ లోకి వెళ్లేలా కొంత అగ్రెసివ్ ప్రమోషన్ చేయడం. రాక్షసుడుకి ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా ఆశించిన ఫలితాన్ని అందుకోవచ్చు. దీన్ని కమర్షియల్ హిట్ గా మలుచుకోవాలి అంటే అది శ్రీనివాస్ చేతిలోనే ఉంది. ఇంత మంచి ఛాన్స్ ని ఉపయోగించుకుంటాడో లేదో చూడాలి