Begin typing your search above and press return to search.
బెల్లం బాబు ఇక్కడేం చేస్తాడో ఏంటో!
By: Tupaki Desk | 19 July 2019 1:30 AM GMTవైవిధ్యమైన కాన్సెప్ట్ లేనిదే తంబీలు సినిమాలు తీయరు. అలా ఎన్నో క్లాసిక్ చిత్రాల్ని తమిళంలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఇప్పటికే తమిళంలో రిలీజై సంచలన విజయం సాధించిన `రచ్చాసన్` అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాక్షసుడు అనేది టైటిల్. ఈ సినిమాలో శ్రీనివాస్ పోలీస్ అధికారిగా ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ కి చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ రీమేక్ చిత్రానికి రైడ్-వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్ పై కే.ఎల్.యూనివర్శిటీ అధినేత కొనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఆగస్టు 2న అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. నేటి ట్రైలర్ ఈవెంట్ లో అసలు బెల్లంకొండ శ్రీనివాస్ నే ఈ సినిమా కోసం ఎందుకు ఎంచుకున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది.
ఏడాది క్రితం రమేష్ వర్మ తో కలసి చెన్నైలో `రాక్షసన్` సినిమా చూశాక హీరోగా ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధత నిర్మాతల్లో నెలకొందట. అటుపై ఓ నలుగురైదుగురు పేర్లు అనుకుని చివరికి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను ఎంచుకున్నారు. తను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించాడు అని అంతా పొగిడేశారు. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలను అందరికీ నచ్చేలా రీమేక్ చేయడం చాలా కష్టం. అయితే దర్శకుడు రమేశ్ వర్మ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని 90 రోజుల్లోనే పూర్తి చేశారని వెల్లడించారు. ఇప్పటికే బెల్లంబాబు కవచం అనే సినిమాలో పోలీస్ అధికారిగా నటించారు. ఆ సినిమా ఫలితం ఏంటో తెలిసిందే. అయితే పరిణతి చెందాక మరోసారి పోలీస్ అధికారిగా నటించాడు కాబట్టి ఈ సినిమా హిట్టవుతుందేమో! అంటూ మీడియాలో ఆసక్తికర చర్చ సాగింది. కెరీర్ లో హిట్టు అన్నదే లేకుండా బెల్లంకొండ శ్రీను వరుసగా క్రేజీ అవకాశాలు దక్కించుకోవడం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. ఇక యాక్షన్ కథల్ని ఎంచుకుని ఇరుగు పొరుగు మార్కెట్ల డబ్బింగ్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ అంటూ బాగానే బిజినెస్ చేసుకోవడం బెల్లంబాబుకే తెలిసిన టెక్నిక్. రాక్షసన్ మంచి కథే. ఈ సినిమాతోనే విష్ణు విశాల్ కి గొప్ప పేరు- గుర్తింపు దక్కాయి. అమెజాన్ లాంటి డిజిటల్ మాధ్యమాల్లో ఈ సినిమాని చూసిన తెలుగు వాళ్లంతా అద్భుతం అని పొగిడేస్తున్నారు. ఇక్కడేమో శ్రీనూ నటించాడు. ఆ హిట్ చిత్రాన్ని తెలుగులో ఎలా తీశారు? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ట్రైలర్ లో ఉన్నంత గ్రిప్ సినిమా ఆద్యంతం ఉంటుందా? అన్నది చూడాలి.