Begin typing your search above and press return to search.
హిందీ మార్కెట్ కి అలా వలేస్తున్నాడు!
By: Tupaki Desk | 22 May 2019 12:00 PM GMTహీరో అవ్వడం వంద జన్మల పుణ్య ఫలం అనుకుంటే.. ఒక భాషలో హీరో అయ్యాక చుట్టు పక్కల ఉన్న అన్ని భాషల్లో అభిమానుల్ని సంపాదించుకోవడం.. అన్నిచోట్లా పరిచయం అయిపోతుండడం అది కొత్త అవకాశ మార్గాల్ని కల్పించడం ఎంతో ఎగ్జయిటింగ్ ఎలిమెంట్. ఇది అప్ కం హీరోలకు సైతం కలిసొస్తోందనే చెప్పాలి. అంతెందుకు నవతరం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు అంటే అతడికి తెలుగు మార్కెట్ కొంత ఉంది అనుకుంటే.. హిందీ నుంచి మరికొంత మార్కెట్ కలిసొస్తోందట. అలా అతడి పై పెట్టే పెట్టుబడి తిరిగి వచ్చేస్తోందని మార్కెట్లో ధీమా ఉందట. ముఖ్యంగా అతడు యాక్షన్ కథాంశాల్ని ఎంచుకుని చేసిన సినిమాలన్నీ ఈ రకంగా హిందీ మార్కెట్ పరంగా వర్కవుటయ్యాయన్న కొత్త లెక్కను చెబుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగులో ఫ్లాపు అన్నదానికి కూడా హిందీ డబ్బింగ్ రైట్స్.. డిజిటల్ రైట్స్ అంటూ ఇతరత్రా మార్గాల ద్వారానూ ఏదోలా పెట్టుబడులు రాబడుతున్నారని తెలిస్తే షాక్ తినడం మనవంతు.
బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ జంటగా నటించిన తాజా సినిమా `సీత` ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్‌లో మాట్లాడుతూ తనకు ఉన్న హిందీ మార్కెట్ గురించి షాకిచ్చే వివరం చెప్పాడు. నాకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. అందుకే హిందీ కోసం కాస్త స్పెషల్‌గా కొన్నిటిని చేస్తున్నాం. హిందీలో బన్ని నటించిన సినిమాతో పాటు నా సినిమాలకు మిలియన్ల మంది ఆదరణ దక్కుతోంది. భగవంతుడు హిందీ మార్కెట్‌ను క్రియేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని లోగుట్టు ఒకటి రివీల్ చేశాడు.
సీత చిత్రానికి కాజల్ వల్లనా.. సోనూసూద్ వల్లనా హిందీలో కలిసొస్తుందనే లెక్కలు ఉన్నాయనే అతడి మాటట్ని బట్టి అర్థమవుతోంది. అసలు సీత సినిమా ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తే.. 20 ఏళ్లు జనాలకు దూరంగా పొల్యూట్ కాకుండా పెరిగిన ఓ అబ్బాయి ఆ జనారణ్యంలోకి ప్రవేశించాక ఏమైంది? డబ్బే సర్వస్వం అనుకునే అమ్మాయికి నింపాది అయిన కుర్రాడికి మధ్య లవ్ కుదిరిందా లేదా? అన్నదే మా సినిమా అని బెల్లంకొండ తెలిపారు. ఈ సినిమాలో కామెడీ పండించే పాత్రలో నటించానని అన్నారు. ఈ చిత్రంతో సోనూసూద్ తనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారని తెలిపాడు. ఇక వీళ్లు చెప్పే దానిని బట్టి చాలా ముందు నుంచే హిందీలో బయ్యలర్లను లైన్ లో పెట్టడం.. లేదా అమెజాన్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీల్ని లైన్ లో పెట్టడం ద్వారా కూడా మినిమం మార్కెటింగ్ యువహీరోలపై చేయొచ్చని దీనిని బట్టి అర్థమవుతోంది.