Begin typing your search above and press return to search.

'రాక్షసుడు' గా బెల్లంకొండ హీరో

By:  Tupaki Desk   |   4 April 2019 6:03 AM GMT
రాక్షసుడు గా బెల్లంకొండ హీరో
X
ఈ నెల 25న సీతతో పలకరించబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో రాక్షసుడిగా రాబోతున్నాడు. గత ఏడాది తమిళ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన రట్ససన్ రీమేక్ ని రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రాక్షసుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ కు ఇదే అర్థం వచ్చే పేరుండటంతో అదే ఫీల్ ని క్యారీ చేయడం కోసం రాక్షసుడు యాప్ట్ గా ఉంటుందని భావించి ఫిక్స్ చేసినట్టు తెలిసింది.

ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తయినట్టుగా సమాచారం. వయసుకు వచ్చిన స్కూల్ కెళ్లే ఆడపిల్లలను ఎత్తుకెళ్లి హత్యలు చేసే ఓ అజ్ఞాత హంతకుడి కోసం వెతికే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాయి శ్రీనివాస్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్టు సమాచారం. తెలుగు వెర్షన్ కు అనుగుణంగా దర్శకుడు రమేష్ వర్మ పలు కీలక మార్పులు చేసినట్టు తెలిసింది

ఉగాది రోజున దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. జూన్ విడుదలకు ప్లాన్ చేసిన రాక్షసుడు ఏ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతోంది. హవీష్ లక్ష్మణన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ రాక్షకుడు బెల్లం హీరోకు స్పెషల్ మూవీగా నిలవబోతోందని టాక్.

అంతు చిక్కని మలుపులతో ఎడ్జ్ అఫ్ ది సీట్ క్రైమ్ థ్రిల్లర్ గా విమర్శకుల ప్రశంశలు అందుకున్న రట్ససన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ రాక్షసుడు రూపొందుతోందని యూనిట్ టాక్. విడుదల తేదీ తదితర వివరాలు పండగ రోజే అందించనున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది