Begin typing your search above and press return to search.
సాక్ష్యంలో కీ పాయింట్ అదేనట!
By: Tupaki Desk | 25 July 2018 7:05 AM GMTఎల్లుండి విడుదల కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం ఓపెనింగ్స్ హీరోని బట్టి కంటే అందులో ఉన్న సబ్జెక్ట్ ని బట్టి వచ్చేలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఫాంటసీ నేపధ్యంలో సినిమాలు రాలేదు కాబట్టి ప్రేక్షకులు కూడా దీని మీద ఆసక్తిగానే ఉన్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన సాక్ష్యంలో గ్రాఫిక్స్ కు పెద్ద పీఠ వేశారు. ఇక ఇందులో కథగా చెబుతున్న కీ పాయింట్ లీక్ రూపంలో ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం సాక్ష్యం గోమాత కాన్సెప్ట్ చుట్టూ ఉంటుందట. తనకు జరిగిన అన్యాయానికి బదులుగా లోక వినాశనం జరగకుండా ఒక ఆవు ఎక్కడో విదేశాల్లో ఉన్న హీరోను ఇక్కడకు రప్పించేలా చేసి అతని ద్వారా ఐదుగురు లోక నాశకులను చంపించడమే సాక్ష్యం కథగా దాని సారాంశం. ఆ క్రమంలో పంచ భూతాల్లో ఒక్కొక్కటి ఒక్కో విలన్ ని చంపేటప్పుడు సాయంగా వస్తాయట. ఆవు హీరోనే ఎందుకు రప్పిస్తుంది అతనికి ఆ విలన్లకు ఉన్న లింక్ ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ లో చూపించేస్తారు. ఆ విలన్లను చంపే ప్రతి ఎపిసోడ్ ను ఉద్వేగభరితంగా సీజే వర్క్ తో ఓ రేంజ్ లో తీసారని టాక్.
ఇది నిజమో కాదో కానీ ట్రైలర్ తో మాత్రం మ్యాచ్ అవుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం. పైగా 40 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొంది అంతే స్థాయిలో బిజినెస్ కూడా జరుపుకుంది. ఓపెనింగ్స్ మాత్రమే కాదు ఓ రెండు వారాల పాటు స్ట్రాంగ్ రన్ దొరికితే సేఫ్ అవుతుంది. పూజా హెగ్డే గ్లామర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తుండగా హర్షవర్షన్ రామేశ్వర్ సంగీత ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. పూజా హెగ్డే డీజేలో హీరోయిన్ గా రంగస్థలంలో ఐటెం సాంగ్ చేసాక కనిపించే సినిమా ఇదే. జగపతి బాబు మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ సంస్థ మొదటిసారి చాలా భారీ బడ్జెట్ తో తీసింది. త్రిష మోహిని-నీహారిక హ్యాపీ వెడ్డింగ్ పోటీలో ఉన్నా అవి డిఫరెంట్ జానర్ కావడంతో పాటు స్టార్ హీరోలు లేని సినిమాలు కాబట్టి సాక్ష్యంకి ఫస్ట్ డే వచ్చిన ఇబ్బంది లేదు. టాక్ కనక నిలబెట్టుకుంటే సాయి శ్రీనివాస్ కు మొదటి బ్రేక్ వచ్చేస్తుంది.