Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్... బెల్లంకొండ శ్రీనివాస్ తో తుపాకీ డాట్ కామ్ స్పెష‌ట్ చిట్ చాట్

By:  Tupaki Desk   |   2 Aug 2019 4:24 AM GMT
ఎక్స్ క్లూజివ్... బెల్లంకొండ శ్రీనివాస్ తో తుపాకీ డాట్ కామ్ స్పెష‌ట్ చిట్ చాట్
X
* అల్లుడు శీనుగానే ఇప్ప‌టికీ మీరు చాలా మంది ప్రేక్ష‌కుల‌కి తెలుసు - మ‌ళ్లీ అల్లుడు శీనుని కొట్టే సినిమా చేయ‌లేక‌పోయాం అని ఎప్పుడైనా అనిపిస్తోందా..

అల్లుడుశీను నా మొద‌టి సినిమా - అది మంచో చెడో తెలియ‌దు కానీ నా మొద‌టి సినిమాకే నేను చాలా పెద్ద స‌క్సెస్ చూసేశాను - బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా చాలా పెద్ద టార్గెట్ నా మొద‌టి సినిమాకే సెట్ అయిపోయింది. నిజం చెబుతున్నా మ‌ళ్లీ అల్లుడుశీను వంటి స్ర్రీప్ట్ కోసం నేను దాదాపు రెండేళ్లు వెయిట్ చేశాను.. అందుకే అల్లుడు శీను - స్పీడున్నోడుకి చాలా గ్యాప్ వ‌చ్చింది. అల్లుడుశీనులో ఫ‌న్ వ‌ర్క్ అవుట్ అయింది క‌దా అని స్పీడున్నోడులో కూడా ట్రై చేశాము.. రిజ‌ల్ట్ ఏమైందో మీకు కూడా తెలుసు.. ఇక పాయింట్ కి వ‌చ్చ‌స్తే - అల్లుడు శీను వంటి స్ర్కిప్ట్ కాదు - అలాంటి టెక్నీషియ‌న్లు - టీమ్ అన్ని కుద‌రాలి - ఇంకో విష‌యం ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క‌మ‌ర్శీయ‌ల్ సినిమాల్ని చూసే ప‌ద్ధ‌తి కూడా మారింది అని బాగా న‌మ్ముతున్నా..

* క‌మ‌ర్శీయ‌ల్ హీరోగా మిమ‌ల్నీ జ‌నాలు ఎక్సెప్ట్ చేస్తున్న‌ప్పుడు ఎందుకు ఈ ఎక్స్ పెర్ మెంట్స్ చేయ‌డం - రిస్క్ అనిపించ‌డంలేదా..

క‌మర్శీయ‌ల్ సినిమాలు అంటే ఇలానే ఉండాల‌నే కోణం నుంచి ఆడియెన్స్ బ‌య‌ట‌కొచ్చేశారు. ఏమాత్రం మ‌నం అతి చేసినా మొహమాటం లేకుండా ఆ సినిమాలు వైపు వెళ్ల‌డం లేదు.. ప్రేక్ష‌కుల్లో ఇంత మార్పు వ‌చ్చినప్పుడు - ఆ సో కాల్డ్ క‌మ‌ర్శీయ‌ల్ ఫార్మూలాల్ని నమ్ముకోంటే తెర‌మ‌రుగవ్వాల్సిందే. అందుకే నా సినిమాల్లో క‌మ‌ర్శీయ‌ల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండానే కొత్త కాన్సెప్ట్స్ తో కూడిన సినిమాలు చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా.. నా లాస్ట్ సినిమా సీత అలానే చేశాను - కానీ ప్రేక్ష‌కులకి పెద్ద‌గా రుచించ‌లేదు. సినిమా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కంతోనే చేసాను కానీ మిస్ ఫైర్ అయింది. ఎట్ లాస్ట్ రిజ‌ల్ట్ మ‌న చేతుల్లో ఉండ‌దు క‌దా.. ఇప్పుడు రాక్ష‌సుడు వంటి ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ నా నుంచి రావ‌డమే ఆడియెన్స్ కి కొంచెం కొత్త‌గా ఉంటుంది. నా క‌మ‌ర్శీయ‌ల్ పెరిమీట‌ర్స్ దాటి ఈ సినిమాలో న‌టించాను. పూర్తిగా క‌థే ఈ సినిమాకు రియ‌ల్ హీరో..

* ఇండ‌స్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ స‌పోర్ట్ కేవ‌లం నిల‌బెట్ట‌డం వ‌ర‌కే ప‌నికొస్తుంది - ఆ త‌రువాత నిల‌దొక్కుకోవాలంటే ఓన్ టాలెంట్ ఉండాలి - ఈ అయిదేళ్ల‌లో మీ ఓన్ టాలెంట్ ని ఎంత షైన్ చేసుకున్నారు..

టాలెంట్ అంటే మీరు యాక్ష‌న్ గురించే గా అడిగేది(న‌వ్వులు)... ఓపెన్ గా చెబుతున్నా ఓ వాళ్లు అంత‌ వీళ్లు ఇంత బాగా న‌టిస్తారంటా - ఇవ్వ‌న్ని ఫీల్డ్ లోకి వ‌చ్చాకే - ఒక్కొ మొట్టు ఎక్కుతూ వ‌చ్చాకే తెలుస్తాయి - ఎక్స్ పీరియ‌న్స్ వల్లే న‌ట‌న‌లో ఇంప్రూవ్ మెంట్ వ‌స్తుంద‌ని నేను బ‌లంగా న‌మ్ముతాను... నేను చేస్తున్న ప్ర‌తి సినిమాలో నా న‌ట‌న అంత‌కుముందు సినిమాకంటే బాగుందా - ఎంత‌వ‌రుకు మ‌నం షైన్ అయ్యాం, ఇంకేం చేయ్యాలి - ఇదే ఆలోచ‌న - నాకు సినిమాలు త‌ప్ప ఇంకేం తెలియ‌వు.. ఒక్కో సినిమా ఇదే నా లాస్ట్ సినిమా అనే రేంజ్ లో క‌ష్ట‌ప‌డ‌తాను.. నా క‌ష్ట‌మే న‌న్ను ఈ అయిదేళ్లు స‌క్సెస్ ఫుల్ గా న‌డిపించింది.. మీరు అనుకోవ‌చ్చు ఈ అయిదేళ్ల‌లో రెండే క‌దా హిట్లు ఉన్నాయ‌ని... నా మీద డ‌బ్బు పెట్టిన‌వారంతా ఫుల్ ప్రాఫిట్స్ లో ఉన్నారు.. బాలీవుడ్ డ‌బ్బింగ్ మార్కెట్ లో నా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్స్ గా నిలిచాయి..

* ఇండ‌స్ట్రీలో ఎవ‌రైనా ఎదుగుతుంటే క్రింద‌కు ప‌ట్టి లాగే వాళ్లు చాలా మంది ఉంటారు - మీ పొడుగు కాళ్ల‌ని పట్టుకుని మిమ‌ల్ని లాగాడానికి ఎవ‌రైనా ఈ అయిదేళ్ల‌లో ఎవ‌రైనా ట్రై చేశారా..

ఇందాక మీరు అడిగిన ప్ర‌శ్న ఉంది క‌దా - అదే ఈ అయిదేళ్ల‌లో మీరేం నేర్చుకున్నార‌ని - ఇదే నేర్చుకున్నా.. న‌న్ను ప‌ట్టుకొని వెన‌క్కి లాగే వాళ్ల‌ని ప‌ట్టించుకోకుండా ముందుకెళ్ల‌డం... మీరు అడిగిన‌ట్లుగా న‌న్ను లాగేద్దాం తొక్కేదాం అని ప్లాన్స్ వేసిన వాళ్లు లిస్ట్ పెద్ద‌దే.. పేర్లు చెప్ప‌లేను కానీ - వాళ్లు అలా చేసిన ప్ర‌తి సారీ నేను ఎదుగుతూ వ‌చ్చాను. ఒకొనొక టైమ్ లో నా సినిమాకు థియేట‌ర్స్ కూడా లేకుండా చేశారు. అలా చేసిన సినిమానే నాకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..

* మిమ‌ల్ని క్రిందకు లాగుదామ‌నుకున్న ఆ సో కాల్డ్ మ‌న‌షులుకి రాక్ష‌సుడు ఎలాంటి స‌మాధానం చెబుతున్నాడు..

(కొద్ది సేపు మౌనం... కొంత సేపు ఆలోచించి) ఆ సో కాల్డ్ మ‌న‌షులు నేను క‌మ‌ర్శీయ‌ల్ ట్రాక్ నుంచి బయటకు వచ్చేసానేమో అని కూల్ అవుతారేమో... కానీ రాక్ష‌సుడు ప్రేక్ష‌కుల‌కి క‌నెక్ట్ అయితే క‌నుక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంది అని న‌మ్ముతున్నా..

* మీరు ముందు న‌టించిన సినిమాల కంటే రాక్ష‌సుడు విష‌యంలో చాలా కాన్ఫీడెంట్ గా క‌నిపిస్తున్నారు - ఎందుక‌ని..

ఈ సినిమా నేను చాలా హార్ట్ కి ద‌గ్గ‌ర‌గా తీసుకొని చేశాను.. ఇలాంటి ఇంట‌ర్నేష‌న‌ల్ కాన్పెప్ట్ తో వ‌చ్చే ఎంగేజింగ్ సినిమా ఇంత‌వ‌రుకు తెలుగులో అయితే రాలేదు.. ప్ర‌తి ఫ్రేమ్ గ్రిప్పింగ్ గా ఉంటుంది. మీరు న‌మ్మ‌రు నేను ఈ సినిమా కంప్లీట్ అయ్యాక దాదాపు 100 సార్లు చూశాను.. ఎక్క‌డైనా ఓ నెగిటివ్ పాయింట్ ప‌ట్టుకుందామ‌ని నాకైతే ఎక్క‌డా క‌నిపించ‌లేదు.. ఆడియెన్స్ ఎవ‌రైనా ఈ సినిమా త‌మిళ్ వెర్ష‌న్ చూస్తే - దానితో ఈ సినిమాను మాత్రం పోల్చ‌కండి.. ఈ సినిమాను తెలుగులోనే డైరెక్ట్ గా చేశార‌నే ఫీలింగ్ తో చూస్తే రాక్ష‌సుడు క‌చ్ఛితంగా మెప్పిస్తాడు. అనుప‌మ కూడా త‌న పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది.

* మీ కాన్ఫీడెన్స్ కి త‌గ్గ‌ట్లుగా అల్లుడు శీను కాస్త రాక్ష‌సుడు శీను అవ్వాల‌ని మా తుపాకీ టీమ్ మ‌నఃస్పూర్తిగా కోరుకుంటున్నాము.. ఆల్ ది బెస్ట్..(న‌వ్వులు)

రాక్ష‌సుడు శీను అంటే అంత బాలేదండి(న‌వ్వులు) అల్లుడు శీనే బెట‌ర్(న‌వ్వులు).. తుపాకీ రీడ‌ర్స్ మా రాక్ష‌సుడు చిత్రాన్ని థియేట‌ర్స్ లోనే చూడండి - ఆ థియేట్రిక్ ఎక్స్ పీరియ‌న్స్ లో చూస్తేనే ఈ సినిమాను ఎంజాయ్ చేయ‌గ‌ల‌రు - పైర‌సీ ని ద‌య‌చేసి ఎంక‌రేజ్ చేయ‌కండి.. థ్యాంక్యూ...