Begin typing your search above and press return to search.
బెల్లంకొండకి ఆ దర్శకుడు మాటిచ్చాడట
By: Tupaki Desk | 1 Nov 2016 5:35 AM GMTతన కొడుకుని కథానాయకుడిగా నిలబెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు బెల్లంకొండ సురేష్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాలని వి.వి.వినాయక్ లాంటి ఓ స్టార్ డైరెక్టర్ చేతులమీదుగా పరిచయం చేయించాడు. ఆ సినిమా కోసం రూ: 50కోట్లు వెచ్చించాడు. అయితే `అల్లుడు శీను`తో బెల్లంకొండ శ్రీనివాస్ కి పేరొచ్చింది కానీ... నిర్మాతగా మాత్రం సురేష్ కి డబ్బులు రాలేదు. శ్రీనివాస్ చేసిన రెండో సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. అయినా సరే శ్రీనివాస్ ని మాత్రం కథానాయకుడిగా నిలబెట్టాల్సిందే అని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు బెల్లంకొండ సురేష్.
ప్రస్తుతం తన కొడుకు మూడవ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్న ఆయన తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ని లైన్లో పెట్టాడు. గౌతమ్ మీనన్ కీ - బెల్లంకొండకీ ఎప్పట్నుంచో మంచి పరిచయాలున్నాయి. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకొనే ఇటీవల `మా అబ్బాయితో మీరు ఒక సినిమా చేయాల`ని కోరాడట. అందుకు గౌతమ్ మీనన్ కూడా అంగీకరించాడట. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సాహసం శ్వాసగా సాగిపో వేడుకలో ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు బెల్లంకొండ. పక్కనే ఉన్న గౌతమ్ మీనన్ కూడా అవునన్నట్టే తలూపారు. ఆ ప్రాజెక్టే గనక ఓకే అయితే బెల్లంకొండ శ్రీనివాస్ దశ తిరిగినట్టే. గౌతమ్ మీనన్ మంచి దర్శకుడు. ఆయన సినిమాలు తెలుగుతోపాటు, తమిళంలోనూ విడుదలవుతుంటాయి. ఆ లెక్కన శ్రీనివాస్ కి రెండు భాషల్లోనూ గుర్తింపు రావడం ఖాయమన్నమాట. మరి మాటల్లోనే ఉన్న ఆ ప్రాజెక్టు చేతల వరకు ఎప్పుడు వెళుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/