Begin typing your search above and press return to search.
చిన్న కొండ మీద ఇంకెన్నికోట్లు పోస్తాడో?
By: Tupaki Desk | 4 Oct 2019 6:15 AM GMTటాలీవుడ్ లో ఒక హీరోను నిలబెట్టడం కోసం అత్యధిక పెట్టుబడి పెట్టిన నిర్మాత ఎవరు అంటే మరో మాట లేకుండా బెల్లంకొండ సురేష్ పేరు చెప్పేయొచ్చు. సొంతంగా నిర్మించిన అల్లుడు శీను దగ్గర్నుంచి.. ఆ తర్వాత తెర వెనుక నిర్మాణ వ్యవహారాలు చూసుకున్న మిగతా సినిమాలన్నింటికీ కలిపితే ఓ వంద కోట్ల దాకా శ్రీనివాస్ మీద సురేష్ ఖర్చుచేసి ఉంటాడంటే అతిశయోక్తి కాదు. అందులో ఎంత మేర వెనక్కి వచ్చిందన్నది అంచనా వేయలేని పరిస్థితి. ఈ మధ్యే వచ్చిన రాక్షసుడు మినహాయిస్తే శ్రీనివాస్ సినిమాల్లో పెట్టుబడి వెనక్కి తెచ్చిన సినిమా ఒక్కటీ లేదు. శ్రీనివాస్ ఇంకా హీరోగా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేదు. ఇంతలోనే అతడి తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా అరంగేట్రం చేయడానికి రెడీ అయిపోయాడు.
శ్రీనివాస్ బాటలోనే గణేష్ కూడా హీరో అవుతాడన్నది ఎప్పుడో ఖరారైన విషయమే. అల్లుడు శీను టైంలోనే మీడియా ముందుకొచ్చి తాను కూడా హీరో కాబోతున్నానని ప్రకటించాడు గణేష్. కానీ పెద్ద కొడుకు నిలదొక్కుకోవడానికి బాగా ఆలస్యం అయ్యేసరికి చిన్న కొడుకును హోల్డ్ చేసినట్లున్నాడు. ఇప్పుడు ప్రేమ ఇష్క్ కాదల్ - సావిత్రి చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని డైరెక్షన్ లో గణేష్ ను హీరోగా పరిచయం చేయడానికి సురేష్ రంగం సిద్ధం చేశాడు. పెద్ద కొడుకులా ఇతడిని మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా లేదు. అతడి అరంగేట్ర సినిమా లవ్ స్టోరీ అంటున్నారు. కాబట్టి బడ్జెట్ కూడా తక్కువే కావచ్చేమో. ఈ సినిమా కూడా పేరుకు బయటి వాళ్లు నిర్మిస్తున్నా పెట్టుబడి అంతా సురేష్ దే అంటున్నారు. మరి చిన్న కొడుకు కోసం సురేష్ ఎన్ని కోట్లు వదిలించుకుంటాడో.. అతడిని ఏమేరకు హీరోగా నిలబెడతాడో చూడాలి.