Begin typing your search above and press return to search.
బెంగాల్ టైగరూ.. నీకోసమే వెయిటింగ్
By: Tupaki Desk | 7 Dec 2015 1:30 PM GMTవైవిధ్యమైన సినిమాలు చేస్తుండటం అదోలా ఉందని.. అర్జెంటుగా ఓ మాస్ మసాలా సినిమా చేయాలనుందని అంటూ మొన్నా మధ్య చిత్రంగా మాట్లాడింది అనుష్క. అంతే మరి.. ప్రేక్షకుల్లో అనేక రకాల జనాలుంటారు. వైవిధ్యాన్ని ఆదరించే వాళ్లతో పాటు మాస్ మసాలా సినిమాలు కోరుకునే ప్రేక్షకులూ అధికంగానే ఉంటారు. నిజానికి సినిమాకు మహారాజ పోషకులు మాస్ ఆడియన్సే. అందుకే వాళ్లను టార్గెట్ గా చేసుకునే ఎక్కువ సినిమాలు తెరకెక్కుతుంటాయి.
ఐతే మాస్, కమర్షియల్ సినిమాల పేరుతో మరీ రొడ్డకొట్టుడు సినిమాలు తీయడంతో ఈ ఏడాది ఆ వర్గం ప్రేక్షకులకు కూడా విసుగొచ్చేసింది. మాస్ మసాలా అంశాలున్నప్పటికీ మరీ రొటీన్ గా ఉన్న సినిమాల్ని ఆ వర్గం ప్రేక్షకులు సైతం ఆదరించలేదు. ఐతే సరైన మాస్ మసాలా సినిమాలు రావట్లేదన్న నిరాశ మాత్రం ఆ వర్గం ప్రేక్షకుల్లో ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది విజయవంతమైన సినిమాల్లో మాస్ ఆడియన్స్ కి మహదానందం కలిగించిన సినిమాలు తక్కువే. అందులోనూ గత కొన్ని నెలల్లో కంప్లీట్ మాస్ మసాలా మూవీ ఒక్కటీ లేకపోవడంతో నిరాశలో ఉన్నారు. ఇలాంటి స్థితిలో మాస్ ఆడియన్స్ కరవు తీర్చేలా కనిపిస్తున్న సినిమా బెంగాల్ టైగర్.
మాస్ ఆడియన్స్ ను అలరించడంలో రవితేజ స్టయిలే వేరు. అందుకే అతను మాస్ రాజా అయ్యాడు. ఇక సంపత్ నంది ‘రచ్చ’ సినిమాతో ఈ వర్గం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘బెంగాల్ టైగర్’ ట్రైలరుతోనే మాస్ ప్రేక్షకులకు వల విసిరింది. ట్రైలర్ లో పంచ్ లు - హీరోయిజం.. ఇద్దరు భామల అందాలు.. వారితో కలిసి రవితేజ ఊర మాస్ పాటలు.. అన్నీ కూడా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్లే కనిపించాయి. అందుకే రవితేజ అన్నట్లు ఇది మాంచి నాన్ వెజ్ సినిమా అవుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు మాస్ ఆడియన్స్. ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బెంగాల్ టైగర్.