Begin typing your search above and press return to search.

బెంగాళ్‌ టైగర్‌.. డిసెంబర్‌ లోనే..

By:  Tupaki Desk   |   15 Nov 2015 5:03 AM GMT
బెంగాళ్‌ టైగర్‌.. డిసెంబర్‌ లోనే..
X
టాలీవుడ్ ఇండ‌స్ర్టీలో ఇప్పుడు ఈ గోల‌కు కాలం చెల్లిపోయింది. ఒక‌ప్పుడు సినిమా రిలీజ్ లంటే ఒకరి మీద‌ ఒక‌రు పోటీకి వ‌దిలేవారు. కానీ నేడు ప‌రిస్థితుల పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణ ఛాయ‌లు అలుముకుంటున్నాయి. ముందు ఆవేశ‌ప‌డినా త‌ర్వాత నిదానంగా ఆలోచించి నిర్మాత‌లు వివాదాలకు దారి తీయ‌ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ఆ మ‌ధ్య గుణ‌శేఖ‌ర్ రుద్ర‌మ‌దేవి సినిమా రిలీజ్ విష‌యంలో పి.వి.పి సంస్థ నిర్మాత‌ల‌కు చిన్న‌పాటి వివాదాలు చోటు చేసుకున్నాయి. ఒక‌ర్ని ఒక‌రు దూషించే స్థాయికి వ‌చ్చే స‌రికి పి.పి.పి వెన‌క్కి త‌గ్గింది. ఇక పై అలాంటి స‌మ‌స్యలు రాకుండా ముందుగానే ఓ ప్లానింగ్ ప్ర‌కారం వెళ్లాల‌ని ఆలోచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా బెంగాల్ టైగ‌ర్ - సైజ్ జీరో - శంక‌రాభ‌ర‌ణం సినిమాల రిలీజ్ డేట్లు ఖారార‌య్యాయి. అయితే ఈ సినిమాలు వారం గ్యాప్ లో ఒక‌టి త‌ర్వాత ఒక‌టి విడుద‌ల చేసుకునేందుకు బెంగాల్ టైగ‌ర్ నిర్మాత‌ రాధామోహ‌న్ - సైజ్ జీరో ప్రొడ్యూస‌ర్ పి.వి.పి - శంక‌ర‌భ‌ర‌ణం స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్ ఓ స‌మావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుకున్నారు. సైజ్ జీరో ఈనెల 27న రిలీజ్ అవుతుండ‌గా - డిసెంబ‌ర్ 4న శంక‌రాభ‌ర‌ణం - అదే నెల 10వ తేదిన బెంగాల్ టైగ‌ర్ సినిమాలు విడుద‌ల చేస్తే బాగుటుంద‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు.

ఇలా చేస్తే ఏ ఒక్క‌రూ న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉండ‌దు. ఎవ‌రి లాభాలు వాళ్ల‌కు వ‌స్తాయి. డిస్ర్టిబ్యూట‌ర్లు - బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోయే అవ‌కాశాలు కూడా ఉండ‌వు. థియేట‌ర్ల స‌మ‌స్య కూడా ఎదుర‌వ‌దు..నిర్మాత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త దెబ్బ‌తిన‌ద‌ని ఈ స‌మావేశంలో తేల్చారు. అందుకే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అని తెలుస్తుంది.