Begin typing your search above and press return to search.

మాస్ రాజానా మజాకా

By:  Tupaki Desk   |   9 Nov 2015 10:51 AM GMT
మాస్ రాజానా మజాకా
X
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర స్టామినా చూపించేవాడే అసలైన స్టార్ హీరో. మాస్ రాజా రవితేజ అలాంటి స్టామినానే చూపిస్తున్నాడు. రవితేజ గత సినిమా కిక్-2 ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. పది కోట్లకు పైగా నష్టం తెచ్చిపెట్టిందా సినిమా. దీని ఎఫెక్ట్ మాస్ రాజా తర్వాతి సినిమా మీద కచ్చితంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ‘బెంగాల్ టైగర్’ విడుదలకు ముందే నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టడం విశేషం.

ఇంతకుముందు చిన్న సినిమాలు తీసి... తొలిసారి రవితేజతో ‘బెంగాల్ టైగర్’ లాంటి భారీ సినిమా నిర్మించిన రాధామోహన్.. విడుదలకు ముందే ఆరేడు కోట్ల దాకా లాభం అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు పాతిక కోట్ల దాకా ఖర్చవగా.. బిజినెస్ రూ.34-35 కోట్ల దాకా అయినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాకు రూ.7.5 కోట్లకు, ఆంధ్రాకు రూ.10 కోట్లకు, సీడెడ్‌ కు రూ.3.6 కోట్లకు అమ్మకాలు జరిగాయట. ఓవర్సీస్ కు రూ.135 కోట్లకు, కర్ణాకటకు రూ.2.6 కోట్లకు హక్కులు అమ్మారట. హిందీ డబ్బింగ్ కి కూడా రూ.2.4 కోట్ల దాకా వచ్చినట్లు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ కు కూడా దాదాపు రూ.7.6 కోట్ల దాకా రాబట్టారట. మొత్తం కలిపితే లెక్క రూ.34-35 కోట్ల దాకా తేలుతోంది. పబ్లిసిటీ ఖర్చులన్నీ కలిపినా నిర్మాత రూ.27 కోట్ల దాకా పెట్టుకున్నాడు. అంటే ఇప్పటికే రూ.7-8 కోట్ల మధ్య టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టాడన్నమాట బెంగాల్ టైగర్.