Begin typing your search above and press return to search.
ఫ్టాప్ వచ్చినా.. శాటిలైట్ అంతా?
By: Tupaki Desk | 12 Nov 2015 5:23 AM GMTమాస్ మహారాజ్ రవితేజ ఇటీవలి కాలంలో కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వరుసగా డిజాస్టర్ సినిమాల్లో నటించి ఫేం పోగొట్టుకున్నాడు. కానీ అనూహ్యంగా తిరిగి లైమ్ లైట్ లోకి రాగలిగాడు. కొన్ని పరాజయాల తర్వాత ఒక్క సినిమా విజయంతో తిరిగి తన మార్కెట్ ని నిలబెట్టుకోగలిగాడు. అది రియల్ గానే ఇంట్రెస్టింగ్ స్టింట్.
ఏదైతేనేం మరోసారి అతడికి కిక్ 2 రూపంలో ఓ భారీ పరాభవం తప్పలేదు. ఇక రవితేజ కెరీర్ అయిపోయినట్టే అనుకుంటున్న టైమ్ లో ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మైండ్ బ్లోయింగ్ అన్న టాక్ తెచ్చుకుంది. రవితేజ మరోసారి తన రేంజెంతో చూపించబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఓ వైపు కిక్ 2 ఇచ్చిన ఝలక్ గురించి తెలిసి కూడా ఓ టాలీవుడ్ టీవీ చానెల్ భారీ మొత్తాన్ని వెచ్చించి బెంగాళ్ టైగర్ శాటిలైట్ హక్కుల్ని కొనుక్కోవడం ఫిలింనగర్‌లో విస్త్రతంగా చర్చకొచ్చింది.
సదరు చానెల్ ఏకంగా రూ.7 కోట్లు వెచ్చించి శాటిలైట్ హక్కుల్ని చేజిక్కించుకుంది. రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ శాటిలైట్ ఇదే. ఓ ఫ్లాప్ తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి ఆ చానెల్ ఎందుకు పెట్టింది? అని ఆరాతీస్తే బిహైండ్ ది స్ర్కీన్ మ్యాటర్ ఒకటి రివీలైంది. ఈ సినిమాలో సదరు టీవీ చానెల్ పెట్టుబడులు కూడా ఉన్నాయన్నదే ఆ సమాచారం. ఇప్పుడర్థమైందా? అసలు మ్యాటర్?