Begin typing your search above and press return to search.
ప్రముఖ దర్శకుడిపై బెంగాలీ భామ షాకింగ్ ఆరోపణలు
By: Tupaki Desk | 14 Jan 2020 5:03 AM GMTఅవకాశాల కోసం వచ్చే వారిని.. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి చేసే ఉదంతాలు ఇప్పటికే చాలానే బయటకు వచ్చాయి. తాజాగా బెంగాలీ నటి ఒకరు ప్రముఖ బెంగాలీ దర్శకుడు ఒకరు తనను లైంగికంగా వేధించిన వైనంపై చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. స్క్రిప్టు చదివేందుకు తన ఆఫీసుకు రావాలని కోరిన దర్శకుడు.. తీరా వెళితే.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైనాన్ని చెప్పి షాకిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బెంగాల్ చిత్ర పరిశ్రమలో పెను సంచలనంగా మారింది.
ప్రముఖ దర్శకుడు అరిందం సిల్ తనను లైంగికంగా వేధించినట్లుగా నటి రూపాంజన మిత్రా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. భూమికన్య సీరియల్ స్క్రిప్టు చదివేందుకు .. దానిపై చర్చలు జరిపేందుకు తన ఆఫీసుకు రావాలని చెబితే.. తాను వెళ్లానని చెప్పారు. ఆ సందర్భంలో అభ్యంతరకరంగా వ్యవహరించారని.. ఇదంతా దసరాకు కొన్ని రోజులు ముందు జరిగినట్లుగా ఆమె చెప్పారు. తన విషయంలో జరిగిన విషయాన్ని తాను కాస్త ఆలస్యంగా బయటపెడుతున్నానని.. ఎందుకంటే తాను పని చేస్తున్న చానల్ గౌరవ మర్యాదలకు భంగం కలిగించకూడదని అగ్రిమెంట్ రాసి ఉండటంతో ఆ విషయాన్ని వెల్లడించలేదన్నారు.
సాయంత్రం ఐదు గంటల సమయంలో దర్శకుడి ఆఫీసుకు వెళితే.. ఎవరూ లేకపోవటం తనకు కాస్త తేడాగా అనిపించినట్లు చెప్పారు. తాను స్క్రిప్టు చదువుతున్న సమయంలో దర్శకుడు అకస్మాత్తుగా తన ముఖం మీదా.. భుజాల మీదా నిమరటం మొదలు పెట్టారని.. దీంతో తాను చాలా భయానికి గురైనట్లు తెలిపారు. తనకు అత్యాచారం జరుగుతుందేమోనన్న ఆందోళన కూడా కలిగిందని.. ఆ సమయంలో గదిలోకి ఎవరైనా రావాలని తాను దేవుడ్ని గట్టిగా ప్రార్థించినట్లు చెప్పారు.
తాను అలాంటి అమ్మాయిని కాదని.. తనతో స్క్రిప్టు గురించి మాత్రమే మాట్లాడాలని స్పష్టంగా చెప్పటంతో సదరు దర్శకుడు తన పనిని ఆపి.. స్క్రిప్టును వివరించే పనిలోకి వెళ్లారని.. ఇది జరిగిన ఐదు నిమిషాలకు దర్శకుడి సతీమణి ఆఫీసుకు రావటంతో తానుబయటకు వచ్చేశానని చెప్పారు. జరిగింది గుర్తు తెచ్చుకొని తాను పెద్ద ఎత్తున ఏడవటం మొదలెట్టానన్నారు. సీరియల్ ప్రసారమయ్యే సమయంలో చానల్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేయకూడదన్న అగ్రిమెంట్ కోసం తాను అతన్ని భరించినట్లుగా చెప్పారు. ఇదిలా ఉంటే.. సదరు నటి చేసిన ఆరోపణల్ని దర్శకుడు ఖండిస్తున్నారు.
తనపై ఆరోపణలు చేసిన నటి.. తాను పాత స్నేహితులమని దర్శకుడు సిల్ పేర్కొన్నారు. ఆమె ఎందుకలా చెప్పారో తనకు అర్థం కావటం లేనని.. తాను వేధించినట్లు చెప్పిన రోజున ఆమె నుంచి తనకో మెసేజ్ వచ్చిందని.. అందులో తాను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు మెసేజ్ చేశారని.. దానికి సంబంధించిన ఆధారం తన ఫోన్ లో ఇంకా ఉందన్నారు. మరీ.. ఎపిసోడ్ లో అసలు నిజం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.