Begin typing your search above and press return to search.

పుష్ప 2 లో బెంగాళి స్టార్.. ఇదే క్లారిటీ..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 6:32 AM GMT
పుష్ప 2 లో బెంగాళి స్టార్.. ఇదే క్లారిటీ..!
X
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 1 ది రైజ్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటే ముందు నవ్వుకున్నా వసూళ్లని చూసి అందరు ముక్కున వేలేసుకున్నారు. బాలీవుడ్ ఆడియన్స్ కి పుష్ప మాస్ ఫీస్ట్ అందించింది.

అందుకే ఆ సినిమాలోని డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్స్ ఇవన్ని మన తెలుగు ఆడియన్స్ కన్నా అక్కడ వారికి బాగా ఎక్కేశాయి. బాలీవుడ్ సినిమాలు రుచించని అక్కడ ఆడియన్స్ కి తెలుగు సినిమాలు ఫుల్ మీల్స్ పెట్టేస్తున్నాయి. వాటిలో పుష్ప కూడా ఒకటి. పుష్ప పార్ట్ 1 ఊహించని విజయాన్ని అందుకోగా పార్ట్ 2 ని అంతకుమించి అనిపించేలా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

పుష్ప 2 మీద ఏర్పడిన అంచనాల వల్ల సినిమాలో స్టార్ కాస్ట్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. సినిమాలో వారు ఉన్నారు వీరు ఉన్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి. మొన్నటిదాకా పుష్ప 2 లో బాలీవుడ్ స్టార్ ఒకరు నటిస్తారని అన్నారు.

ఇక ఇప్పుడు బెంగాళి స్టార్ పుష్ప 2లో ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. బెంగాళి నటుడు జిషు సెంగుప్తా బెంగాళి సినిమాలే కాదు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన భీష్మ, శ్యామ్ సింగ రాయ్ మూవీస్ లో ఆయన నటించారు. పుష్ప 2 లో జిషు నటిస్తాడని వార్తలు రాగా తాను ఆ సినిమాలో నటించట్లేదని క్లారిటీ ఇచ్చారు.

పుష్ప 2 టీం నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని. తాను పుష్ప పార్ట్ 2లో నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు జిషు సెంగుప్త. బెంగాళిలో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న ఆయన తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తున్నారు.

పుష్ప 2 లో ఆయన ఉంటే మరింత క్రేజ్ ఉండేది. అయినా సరే సుకుమార్ లెక్కంటే లెక్కే.. ఏ పాత్రకి ఎవరిని తీసుకోవాలే ఆయనకు బాగా తెలుసు. అందుకే అనవసరమైన కాస్టింగ్ ఎందుకని అనుకుంటాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న పుష్ప 2 సినిమాపై ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పడింది. అసలు కథ పార్ట్ 2 లో ఉంది అంటూ చిత్రయూనిట్ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.