Begin typing your search above and press return to search.

బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్న నిఖిల్..!

By:  Tupaki Desk   |   20 March 2023 11:00 AM GMT
బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్న నిఖిల్..!
X
యువ కథానాయకుడు నిఖిల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బేగంపేట బోయ్ గా పేరు తెచ్చుకున్న ఈయన.. హ్యాపీ డేస్ చిత్రంలో హీరోగా నటించాడు. రాజేష్ పాత్రలో అదరగొట్టాడు. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా కార్తికేయ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్నాడు. ప్రస్తుతం ఈయన స్పై సినిమాలో నటిస్తూ బిజీగా మారిపోయాడు.

గతేడాది కార్తికేయ2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన నిఖిల్.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. భక్తిరస థ్రిల్లర్ లో నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరమైన విజయాన్ని కూడా అందుకున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్‌గా నిఖిల్ స్థానాన్ని సుస్థిరం చేసింది.

అలాగే ఉత్తరాది, దక్షిణాది అన్ని వర్గాల ప్రజల హృదయాలను గెలుచుకుంది. టీవీలతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా కూడా ప్రేక్షకులను ఊర్రూతలూగించిందీ చిత్రం. అన్ని ఫార్మాట్లలో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి సినీ ప్రేమికుల మదిలో నిలిచిపోయింది.

హీరో కార్తికేయ అవార్డుల విభాగంలోనూ తన సత్తాను చాటుకుంటున్నాడు. ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. తనను, తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్తికేయ 2 సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై.. విశ్వ ప్రసాద్ టీజీ, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.

కృష్ణుడి లీలలు, ఆయన గొప్పతనం గురించి వర్ణిస్తూ సాగిన కార్తికేయ 2 చిత్ర సూపర్ హిట్ గా నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల కంటే హిందీ రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. కార్తికేయ 2 చిత్రాన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) కూడా మెచ్చుకుంది.

కార్తికేయ 2 చిత్ర బృందానికి ప్రశంసాపత్రం, కృతజ్ఞతా పత్రాన్ని అందించింది. ఇస్కాన్ ఇప్పటి వరకూ ఏ సినిమాకి కూడా ప్రశంస పత్రాన్ని జారీ చేసింది లేదు. కానీ మొదటిసారిగా కార్తికేయ 2 చిత్రాన్ని ప్రశంసించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.