Begin typing your search above and press return to search.

2018 ఉత్త‌మోత్త‌మ చిత్రం

By:  Tupaki Desk   |   25 Dec 2018 1:30 AM GMT
2018 ఉత్త‌మోత్త‌మ చిత్రం
X
2018 ఉత్త‌మ చిత్రం ఏది? ఈ ఏడాది అర‌డ‌జ‌ను బ్లాక్ బ‌స్ట‌ర్లను ప‌రిశీలిస్తే వీటిలోంచి ఉత్త‌మోత్త‌మ చిత్రం ఏదో వెతికితే ఏ కోణంలో చూసినా `రంగ‌స్థ‌లం` చిత్రానికే ఎక్కువ మార్కులు వేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌హాన‌టి - గీత గోవిందం - భ‌ర‌త్ అనే నేను - గూఢ‌చారి చిత్రాలు వ‌రుస‌గా టాప్ 5 జాబితాలో నిలుస్తాయి. జ‌నాద‌ర‌ణ క్ర‌మంలో ఈ ఆర్డ‌ర్‌ ని చెప్పొచ్చు.

`రంగ‌స్థ‌లం` చిత్రానికి అగ్ర తాంబూలం ఇవ్వ‌డానికి కార‌ణం ప్ర‌త్యేకించి విశ్లేషించాలి. ఈ చిత్రంలో క‌థ అద్భుతం. గోదారి బ్యాక్ డ్రాప్ లో ఆ యాస‌ - భాష‌ - వేషంతో చిట్టిబాబుగా చ‌ర‌ణ్ న‌టన అద్భుతం. అలాగే ఈ చిత్రంలో న‌టించిన స‌మంత - అన‌సూయ పాత్ర‌లు హైలైట్. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ‌ - రామ‌ల‌క్ష్మిగా స‌మంత అద్భుత అభిన‌యంతో ఆక‌ట్టుకున్నారు. ఇక ఆది పినిశెట్టి న‌ట‌న మ‌రో హైలైట్. పాట‌లు - క‌థాంశం - ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఇలా అన్ని విభాగాల్లో ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఉర్రూత‌లూగించింది. అందుకే ఇది నంబ‌ర్-1 చిత్రమనడంలో సందేహం లేదు.

ఇక ఆ త‌ర్వాత సావిత్రి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిన `మ‌హాన‌టి` చిత్రానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు నీరాజ‌నం ప‌లికారు. నాగ్ అశ్విన్ ఆ సినిమాని త‌ర‌కెక్కించిన వైనం పైనా - కీర్తి సురేష్ న‌ట‌న‌ పైనా రాజ‌మౌళి అంత‌టి ద‌ర్శ‌క‌దిగ్గ‌జం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సామాన్య జ‌నాల‌కు గొప్ప‌గా చేరువైన ఈ చిత్రం నంబ‌ర్ 2 అనే చెప్పాలి. ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `గీత గోవిందం` చిత్రానికి ఆ క్రెడిట్ ద‌క్కుతుంది. చాలా సింపుల్ లైన్ తీసుకుని అద్భుత‌మైన క‌థ‌నంతో తెర‌కెక్కించిన ప్ర‌తిభ ప‌ర‌శురామ్‌ కి చెందుతుంది. దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మంద‌న న‌ట‌న మైమ‌రిపిస్తుంది. యూత్ కి బాగా చేరువైన చిత్ర‌మిది. అందుకే ఈ సినిమా నంబ‌ర్ 3. మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` స్టార్ ప‌వ‌ర్‌ తో భారీ వ‌సూళ్లు సాధించింది. సీఎం పాత్ర‌లో మ‌హేష్ న‌ట‌న‌కు అభిమానులే కాదు - కామ‌న్ జ‌నం స‌లాం కొట్టారు. అయితే ఇది ఇత‌ర సినిమాల‌తో పోలిస్తే కాస్త రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాని త‌ల‌పించింది. అందుక‌నే నాలుగో స్థానానికి ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత అడివి శేష్ న‌టించిన `గూఢ‌చారి` చిత్రం మేకింగ్ ప‌రంగా క్లాస్సిక్ మూవీగా నిలిచింది. 007 త‌ర‌హా కంటెంట్ తో చ‌క్క‌ని ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మిది. ఈ చిత్రం ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాల్లో బెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే ఇది టాప్ 5 సినిమా అని చెప్పొచ్చు.