Begin typing your search above and press return to search.

బాహుబలి2తో చిన్న సినిమాల పోటీ!

By:  Tupaki Desk   |   7 Jun 2018 5:32 AM GMT
బాహుబలి2తో చిన్న సినిమాల పోటీ!
X
బాహుబలి ది కంక్లూజన్ లాంటి చిత్రంతో పోటీ పడడం అంటే ఏ సినిమాకు అయినా రిస్కే. అన్ని రకాలుగాను మెప్పించి.. కలెక్షన్స్ సునామీ సృష్టించిన ఈ మూవీ ఇండియాలో సృష్టించన రికార్డులను ఇప్పట్లో బ్రేక్ చేయడం ఎవరికైనా కష్టమే. కానీ ఇదంతా థియేటర్లల దగ్గర మాత్రమే చెల్లుతుంది.

అవార్డుల విషయానికి వచ్చేసరికి.. ఎంతటి గొప్ప సినిమాకు అయినా టఫ్ కాంపిటీషన్ తప్పదు. ఇప్పుడు గతేడాదికి సంబంధించిన అవార్డుల సీజన్ మొదలైంది. జియో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2018కు ఇప్పుడు నామినేషన్స్ ను విడుదల చేశారు. బెస్ట్ ఫిలిం కేటగిరీ చూస్తే ఎవరైనా సరే ఔరా అనుకోవాల్సిందే. ఈ లిస్ట్ లో బాహుబలి:ది కంక్లూజన్ ఉండడం విచిత్రమేమీ కాదు. కానీ ఈ సినిమాతో పోటీ పడుతున్న చిత్రాలుగా గౌతమిపుత్ర శాతకర్ణి.. శతమానం భవతి.. అర్జున్ రెడ్డి.. ఘాజీ.. ఫిదా.. ఉన్నాయి. వేటికవే డిఫరెంట్ జోనర్స్.. అన్నీ బాగా ఆడేసిన సినిమాలు లిస్ట్ లో ఉండడం సహజమే.

అయితే.. బాహుబలి లాంటి మూవీతో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఫిదా.. అర్జున్ రెడ్డిలు నిలవడం కచ్చితంగా ఆకర్షిస్తుంది. వందల కోట్ల బడ్జెట్ ఎక్కడ.. 5 కోట్లకు మించి ఖర్చు చేయని అర్జున్ రెడ్డి ఎక్కడ అనిపించక మానదు. అలాగే ఫిదా మూవీ కూడా. ఇక్కడ బాహుబలి2తో పోటీ పడే స్థాయికి ఈ సినిమాలకు చేర్చినది కంటెంట్ మాత్రమే. కథలో దమ్ము ఉండాలే కానీ.. ఏ బాహుబలిని ఎదిరించవచ్చని నిరూపించాయి ఈ సినిమాలు.