Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఐడియ‌ల్ అత్తా కోడ‌ళ్లు

By:  Tupaki Desk   |   29 Oct 2019 1:30 AM GMT
టాప్ స్టోరి: ఐడియ‌ల్ అత్తా కోడ‌ళ్లు
X
ఏ అత్త-కోడ‌ల మ‌ధ్య పొస‌గ‌దంటారు. అత్త ఎడ్డెం అంటే! కోడ‌లు తెడ్డం అంటుంది. చిన్న చిన్న విష‌యాల్లోనే అత్త‌-కోడ‌ళ్ల మ‌ధ్య వివాదాలు త‌లెత్తుతాయి. ఫ‌లితంగా కోడ‌లు ముందు గుమ్మంలో ఉంటే? అత్త వెనుక గుమ్మంలో ఉంటుంది. ప్ర‌తీ కోడ‌లుకి అత్త అంటే క‌ళ్ల ముందు సూర్యాకాంత‌మే క‌నిపిస్తుదంటారు. ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కాలం మారుతోన్న కొద్ది అత్త-కోడ‌లి మ‌ధ్య అనుబంధాలు పెరుగుతున్నాయి. కోడ‌లికి మెట్టినిల్లే పుట్టినిల్లుగా మారిపోతోంది. తాజాగా టాలీవుడ్ కోడ‌ళ్లు త‌మ అత్తల గురించి ఏం చెబుతున్నారో వారి మాట‌ల్లోనే తెలుసుకుందాం.

న‌మ్ర‌తా శిరోద్క‌ర్- మ‌హేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లో ఆద‌ర్శ దంప‌తులు. మ‌హేష్ తో పెళ్లై 14 ఏళ్లు అవుతుంది. పెళ్లైన కొత్త‌లో సినిమాలు చేయాల‌ని న‌మ్ర‌త‌కి ఉండేదట‌. కానీ కృష్ణ ఇంట్లో కుటుంబ‌ స‌భ్యుల్ని చూసిన త‌ర్వాత ఇల్లాలి గానే ఉండిపోవాల‌ని మ‌న‌సు మార్చుకున్నారట‌. అత్తయ్య ఇందిరా దేవితో తెలుగు స‌రిగ్గా రాక కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో ప‌ట్టు బ‌ట్టి తెలుగు నేర్చుకున్నారట‌. ఆ విష‌యంలో అత‌మ్మ ఎంతో స‌హాయం చేసారు. మ‌హేష్ ని అర్ధం చేసుకునే అమ్మాయివి దొరికినందుకు చాలా సంతోషంగా ఉండేవార‌ట‌. ఇంటికి ఎలాంటి కోడ‌లు రావాల‌నుకున్నారో..అలాంటి కోడ‌లే వ‌చ్చింద‌ని అత్తమ్మ ఇందిర‌ మురిసిపోయేవారు. అందుకు న‌మ్ర‌త హ్యాపీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విష‌యాలున్నాయి. పెళ్లైన కొత్త‌లో న‌మ్ర‌త త‌ల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చ‌నిపోయారట‌. డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయిన న‌మ్ర‌త‌ను అత్తమ్మ ద‌గ్గ‌రుండి అన్నీ చూసుకున్నారు. ``అన్నం తినిపిస్తుంటే అత్త‌మ్మ‌లో అమ్మ‌ క‌నిపించేవార‌ని` న‌మ్ర‌త ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

ఇక రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అత్త‌మ్మ అంటే ఉపాస‌న‌కు ప్రాణం. ఇంట్లో క్ష‌ణం లేక‌పోయినా విల‌విల‌లాడిపోతాడు. నాకు ఆమె అంటే చాలా గౌర‌వం. పెట్స్ అంటే ఇష్టం. చిన్న నాటి నుంచి వాటిని పెంచే అల‌వాటు ఉంది. పెళ్లి త‌ర్వాత ఇంట్లో పెట్స్ పెంచుకుంటానంటే ఏమంట‌రోన‌నే భ‌యం ఉండేది. కానీ ఆ విష‌యంలో అత్త‌మ్మ ఎంతో స‌హాయం చేసారు. త‌నే ఎన్ని పెట్స్ తెచ్చుకుంటావో నీ ఇష్టం. నాకెలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు. ``ఇది నీ ఇల్లు అన్నారు. అడ‌గ‌కుండానే అంద‌రి మ‌న‌సులు అర్ధం చేసుకుంటారు. ఆమె ప‌నులు ఆమె చేసుకుంటారు. ఇంట్లో రెండు త‌రాల కోడ‌ళ్లం ఉన్నామ‌న్న‌మాట (న‌వ్వుతూ). సురేఖ అత్త త‌న ఇద్ద‌రు కూతుళ్లు లానే న‌న్ను చూస్తుంటారు. ఆ విష‌యంలో ఎంతో ల‌క్కీ`` అని ఉపాస‌న‌ అన్నారు.

ఇక బాల‌కృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మిణి- లోకేష్ ను వివాహం ఆడి చంద్ర‌బాబు నాయుడు ఇంట కోడ‌లిగా అడుగు పెట్టిన బ్రాహ్మిణి అత్త గురించి చెప్పి మురిసిపోయారు. ద‌గ్గ‌ర సంబంధం కావ‌డంతో చిన్న‌ప్ప‌టి నుంచి అత్త‌మ్మ భువ‌నేశ్వ‌రి తో బాగా మెలిగేద‌నిన‌ని అన్నారు. అందుకే ఆ ఇల్లు మెట్టినిల్లు అనేకంటే పుట్టినిల్లు అనే ఫీల‌వుతాన‌ని తెలిపారు. మొత్తానికి అత్త‌ల్ని అమ్మ‌లుగా పూజిస్తున్న ఈ కోడ‌ళ్లు ప్ర‌పంచంలోని అంద‌రు కోడ‌ళ్ల‌కు ఆద‌ర్శం. కోడ‌ళ్ల‌ను కూతుళ్లుగా చూసుకునే ఈ అత్త‌లంతా ప్ర‌పంచంలోని అత్త‌లంద‌రికీ ఆద‌ర్శం.