Begin typing your search above and press return to search.
సూర్య మూవీకి బెస్ట్ రేటింగ్.. అక్కడా హద్దుల్లేవ్!
By: Tupaki Desk | 21 Jan 2021 10:47 AM GMT'ఆకాశం నీహద్దురా..' ఈ సినిమా విజయం సూర్యకు చాలా అవసరం. కెరీర్ పరంగా సక్సెస్ అవశ్యమైతే.. భౌతిక అవసరాల dRష్ట్యా అత్యవసరం. తనమీదున్న బాధ్యతలు నెరవేర్చడంతోపాటు.. దాదాపు 70 కోట్ల రూపాయల అప్పులను తీర్చాల్సిన పరిస్థితి. అందుకే.. అందరూ సినిమాలను తీసి స్టోర్ రూములో దాచుకున్నా, తప్పని పరిస్థితుల్లో మొండి ధైర్యం చేసి ఓటీటీలో రిలీజ్ చేశాడు సూర్య.
ఆ విధంగా.. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ మూవీ.. హ్యూజ్ రెస్పాన్స్ ను అందుకుంది. గతేడాది ఓటీటీలో అత్యధికంగా చూసిన ఇండియన్ సినిమాల్లో రెండో చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ వెల్లడించింది.
ఆ విధంగా ఓటీటీలో సూపర్ హిట్ కొట్టిన 'ఆకాశం నీహద్దురా' మూవీ.. తాజాగా బుల్లితెరపైనా సత్తా చాటింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు 6.77 టీఆర్పీ వచ్చింది. ఈమధ్య కాలంలో టీవీల్లో ప్రసారమైన సూర్య సినిమాల్లో ఇది అత్యుత్తమ రేటింగ్.
గతంలో సూర్య నటించిన బందోబస్త్, ఎన్ జీకే, గ్యాంగ్ వంటి సినిమాలకు ఈ స్థాయి రేటింగ్ రాలేదు. ఓటీటీలో అందరూ మెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పుడు బుల్లితెరపై కూడా హిట్టవ్వడం టీం మొత్తానికీ ఆనందం కలిగించే అంశమే.