Begin typing your search above and press return to search.

ఈ ఏడాది విలన్స్ చీల్చి చెండాడేశారు

By:  Tupaki Desk   |   11 Dec 2016 5:30 PM GMT
ఈ ఏడాది విలన్స్ చీల్చి చెండాడేశారు
X
ఓ సినిమా హిట్ అయితే.. హీరోకి డైరెక్టర్ కి పేరు రావడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ విలన్ పాత్రలకు పేరు రావడం.. హీరోతో సమానంగా.. ఆ మాటకొస్తే హీరోకు మించి విలన్ పాత్రలు చేసినవాళ్లకు అప్లాజ్ రావడం చిన్న విషయం కాదు. ఈ ఏడాది అలాంటి సినిమాలు ఇప్పటికే అర డజను థియేటర్లలో సందడి చేసేశాయి.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్ కి పోటీగా.. ధీటుగా నటించాడు జగపతి బాబు. స్టైలిష్ విలన్ గా జగపతి చేసిన ఆ రోల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సౌత్ మొత్తం నుంచి విలన్ ఆఫర్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత క్షణం మూవీలో అనసూయ స్పెషల్ రోల్ అనుకుంటే..చివరికి వచ్చేసరికి విలన్ గా మారిపోయి విశ్వరూపం చూపించేసింది. ఆమె యాక్టింగ్ క్షణం మూవీ సక్సెస్ కి అసలైన సీక్రెట్ గా మారిపోయింది. సమ్మర్ స్టార్టింగ్ లో వచ్చిన సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ కి పోటీగా యంగ్ విలన్ గా ఆది పినిశెట్టి చూపించిన యాక్టింగ్ కి డిస్టింక్షన్ మార్కులు పడ్డ విషయం మర్చిపోలేం.

సమ్మర్ లోనే విక్రం ట్రిపుల్ రోల్ చేయగా.. అన్నిటి కంటే విలన్ ఆత్రేయ పాత్రలో చూపించిన సూర్య విశ్వరూపం అదిరిపోతుందంతే. త్రివిక్రమ్ మూవీ అ..ఆ.. లో పల్లం వెంకన్నగా నెగిటివ్ రోల్ పోషించాడు రావు రమేష్. సినిమాలో ఎన్ని కేరక్టర్స్ ఉన్నా.. రావు రమేష్ పాత్ర తీరుతెన్నులను.. వాటిని ఈయన మెప్పించిన తీరు అసామాన్యం.

ఇక లాట్ బట్ నాట్ లీస్ట్ ధృవలో అరవింద్ స్వామి. స్లిక్ అండ్ స్టైలిష్ రోల్ సటిల్డ్ పెర్ఫామెన్స్ తో.. తను తప్ప ఆ పాత్రను మరెవరు చేయలేరనే రేంజ్ లో అరవింద్ స్వామి చేసిన సిద్ధార్ధ అభిమన్యు రోల్.. కేకలు పెట్టించేస్తుంది. అరవింద్ స్వామి కెరీర్ కి టర్నింగ్ మాత్రమే కాదు.. తనను మరో రేంజ్ కి తీసుకెళ్లిన రోల్ ఇది. ఈ ఏడాదికి గాను బెస్ట్ విలన్ రోల్ ను ఎంపిక చేయడం చాలా కష్టం అనిపించడంలో ఆశ్చర్యం లేదు.