Begin typing your search above and press return to search.
వర్మను ఫాలో అవుతున్న బేతాళుడు
By: Tupaki Desk | 18 Nov 2016 7:10 AM GMTఇప్పుడు ప్రమోషన్ తో ఎంత సెన్సేషన్ సృష్టించామా అనేదే ట్రెండ్. కావాల్సినంత ప్రమోషన్ చేస్తే.. ఆటోమ్యాటిక్ గా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ఒక మైనస్ కూడా ఉందండోయ్. అదేంటంటే.. ప్రమోషన్ చేశాక కంటెంట్ లో దమ్ములేకపోతే మాత్రం చేతులు కాలిపోతాయ్.
తన తొలిసినిమాను పెద్దగా ప్రమోట్ చేయని విజయ్ ఆంటోని.. ఆ సినిమా కంటెంట్ కారణంగా హిట్టవ్వడంతో ఇప్పుడు నూతన ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. ''బిచ్చగాడు'' సినిమా ఒక నాని అండ్ రవితేజల సినిమాలకంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. అందుకే తన తదుపరి సినిమా ''భేతాళుడు'' కోసం మనోడు భారీ ఏర్పాట్లే చేశాడు. ఈసారి రామ్ గోపాల్ వర్మను కూడా ఫాలో అవుతున్నాడు. అప్పట్లో ది ఎటాక్స్ ఆఫ్ 26/11 సినిమాను ప్రమోట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ ఏకంగా సినిమాకు సంబంధించిన తొలి 15 నిమిషాల వీడియోను నెట్టింట్లో రిలీజ్ చేశాడు. ఇప్పుడు అదే పద్దతిని ఫాలో అయిపోతూ.. విజయ యాంటోనీ కూడా తన భేతాళుడు సినిమాకు సంబంధించిన తొలి 10 నిమిషాలు వీడియో రిలీజ్ చేసేశాడు.
ఒక విధంగా చెప్పాలంటే ఈ వీడియోతో భేతాళుడుపై చాలా ఆసక్తి వచ్చేసింది. ఎందుకంటే సినిమాలోని సైకలాజికల్ థీమ్.. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. ఇంట్రస్టింగ్ టైటిల్ డిజైన్స్.. ప్లస్.. అసలు సైతాన్ అనేవాడు జయలక్ష్మి కోసం ఎందుకు వెతుకుతున్నాడు అనే కంటెంట్ కు అందరూ బాగా కనక్ట్ అయిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/